Surekha Vani : రెండో పెళ్లి చేసుకున్న సురేఖవాణి..? ఫోటో వైరల్..!

October 18, 2021 7:46 AM

Surekha Vani : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా సోషల్ మీడియా వేదికగా అద్భుతమైన డాన్స్ చేస్తూ, తన కూతురితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటుంది.

Surekha Vani second marriage photo viral

ఈ క్రమంలోనే సురేఖ వాణి భర్త కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. అయితే సురేఖవాణి రెండో వివాహం చేసుకోబోతోంది.. అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన సురేఖవాణి.. తన రెండవ పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ వార్తలను తీవ్రస్థాయిలో ఖండించింది.

అయితే సురేఖ వాణి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేసింది. ఇందులో సురేఖ వాణి మెడలో మంగళ సూత్రాలు ఉండటంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. సురేఖ వాణి ఎవరికీ తెలియకుండా రహస్యంగా రెండో పెళ్లి చేసుకుందా ? అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగానే ఈమె ఎవరికీ తెలియకుండా రెండో వివాహం చేసుకుందా..? లేక సినిమాలలో భాగంగా ఇలా మంగళసూత్రం ధరించిందా.. అనే విషయం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now