Apparao : జబర్దస్త్ ద్వారా పరిచయమైన కమెడియన్ లలో అప్పారావు ఒకరు. ఈయన జబర్దస్త్ వేదికపై చేసే కామెడీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అప్పారావు కేవలం జబర్దస్త్ వేదికపై మాత్రమే కాకుండా పలు చిత్రాల ద్వారా కూడా ప్రేక్షకులను సందడి చేశారు. ఇక జబర్దస్త్ వేదికపై ఆయన భార్య సుబ్బలక్ష్మి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన కామెడీని పండించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైన అప్పారావు ఇతర కార్యక్రమాలలో తన భార్యతో కలిసి పాల్గొని ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నారు.
ఈ క్రమంలోనే సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమానికి అప్పారావు తన భార్యతో కలిసి వచ్చారు. క్యాష్ వేదికపై అప్పారావు, ఆయన భార్య సుబ్బలక్ష్మిని పలు టాస్క్ లతో సుమ సందడి చేయించింది. ఒక టాస్క్ లో భాగంగా అప్పారావు, సుబ్బలక్ష్మి లవ్ మ్యారేజ్ చేసుకున్న వారి మాదిరిగా నటించమని సుమ చెప్పడంతో ఈ జంట రెచ్చిపోయారు.
ఈ టాస్క్ లో భాగంగా అప్పారావు తన భార్య సుబ్బలక్ష్మిని ముద్దు అడగడంతో ఇప్పుడు వద్దంటూనే స్టేజ్ పైనే కెమెరాలకు కనిపించకుండా లిప్ కిస్ చేసుకున్నట్లు చూపించడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇలాంటి వేదికపైనే అప్పారావు దంపతులు చేసిన పనికి సుమ తల దించుకుని ఒక్కసారిగా నోటి పై వేలు వేసుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…