Anushka Shetty : నాగార్జున హీరోగా నటించిన సూపర్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క కేవలం ఒకే ఒక్క సినిమాతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. తన కెరీర్ లో కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అనుష్క. అరుంధతి, భాగమతి లాంటి సినిమాలు ఆమె స్థాయిని మరింత పెంచాయి. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా అనుష్క పేరు మారు మోగిపోయింది.
మొదట్లో అనుష్క పారితోషికం లక్షల్లో ఉండేది. అయితే అద్భుతమైన కథాంశం తో వచ్చిన అరుంధతి మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో తన రెమ్యునరేషన్ అనూహ్యంగా కోటికి పెంచేసింది. అప్పట్లో అదే చాలా ఎక్కువ. ఆ తర్వాత మిర్చి, ఢమరుకం, బాహుబలి తర్వాత అనుష్క తన రెమ్యునరేషన్ నాలుగు కోట్ల వరకూ పెంచేసింది. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా అనేక చిత్రాల్లో నటించింది. దాదాపు 47 చిత్రాలలో కనిపించిన అనుష్క అత్యధిక పారితోషికం పొందే దక్షిణ భారత నటీమణులలో ఒకరు.
మరి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనుష్క ఆస్తులు విలువ ఎంత అంటూ సోషల్ మీడియాలో చర్చి మొదలైంది. అరుంధతి తర్వాత అనేక చిత్రాల్లో నటించిన అనుష్క భారీ మొత్తంలో పారితోషకం అందుకుంటూ చాలా ఆస్తులు సంపాదించింది. అనుష్క ఆస్థి దాదాపు 250కోట్లు ఉంటుందని సినీ వర్గాల్లో అంచనా. నగదు రూపంలో అసలు తన దగ్గర ఏమీ ఉంచుకోడానికి ఇష్టపడని స్వీటీ ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో దాస్తోందట. ఇక బెంగళూరులో విలాసవంతమైన భవంతులు, ఫామ్ హౌస్ లు అనుష్క పేరిట ఉన్నాయని సమాచారం.
అంతేకాదు బాహుబలి తర్వాత హైదరాబాద్ లో కొన్ని నివాస స్థలాలు కొన్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ప్రస్తుత మార్కెట్ వేల్యూ ప్రకారం ఆ స్థలాల ధర వందకోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఆమె వద్ద గోల్డ్ కూడా పెద్ద మొత్తంలో ఉంటుందని అంచనా. అనుష్క దగ్గర ఉన్న బెంజ్ కారు, బిఎం డబ్య్లు కారు ఖరీదు కోటికి పైనే విలువ ఉంటుందని తెలుస్తోంది .
అయితే కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అనుష్క. మళ్లీ సినిమాలు ఒప్పుకోవడం మొదలుపెట్టింది. త్వరలో యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకుంది అనుష్క. మిర్చి, భాగమతి విజయాల తర్వాత యూవీ క్రియేషన్స్ సంస్థలో ఆమె నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇందులో ఆమె సరికొత్త లుక్ లో చెఫ్ గా కనిపించనుంది అని సమాచారం. ఈ సినిమాను తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం మొత్తం నాలుగు దక్షిణాది భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…