Anchor Lasya : అమెరికా వెళ్లే యాంకర్లు చేసేది అదే.. నన్ను కూడా రమ్మన్నారు.. యాంకర్‌ లాస్య సంచలన కామెంట్స్‌..

January 1, 2022 8:39 AM

Anchor Lasya : బుల్లితెరపై యాంకర్లుగా స‌త్తా చాటిన‌ వారు చాలా మందే ఉన్నారు. వీరిలో లాస్య మంజునాథ్ ఒకరు. యాంకర్ గా రాణిస్తున్న సమయంలోనే లాస్య పెళ్లిచేసుకుంది. ఆ తర్వాత యాంకరింగ్ కు దూరమయ్యింది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది లాస్య. తాజాగా సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ అనే ప్రోగ్రాంకి హాజరైన లాస్య తను గతంలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది.

Anchor Lasya sensational comments on anchors

అమెరికాలో ఓ ఈవెంట్ కోస‌వ వెళ్లిన‌ప్పుడు ఉన్న‌త స్థానంలో ఉన్న వ్య‌క్తి నాకు ఫోన్ చేసి ప‌క్క‌లో ప‌డుకోమ‌ని చాలా ప‌చ్చిగా మాట్లాడాడు. నేను అందుకు కుద‌ర‌ద‌ని చెప్పేశాను. ‘నాతో పెద్ద పెద్ద యాంకర్లే పడుకున్నారు.. నువ్వెంత ?’ అంటూ ఆ వ్యక్తి తనతో అసభ్యంగా మాట్లాడాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈవెంట్స్ కోసం అమెరికా వెళ్లిన హీరోయిన్లు అక్కడ కాసేపు మాత్రమే ఉంటారని, ఆ తర్వాత హోటల్స్ లో రూమ్ కి వెళ్ళి తమకు నచ్చిన వారితో వారు వెళ్ళిపోతారని అమెరికాలో జరిగిన ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలిందంటూ లాస్య చెప్పుకొచ్చింది.

అమెరికాలో ఉన్న వ్యాపారవేత్తలకు.. హీరోయిన్‌లను ఎరగా వేసి కొందరు భారీగా డబ్బులు సంపాదిస్తున్నారని లాస్య ఆరోపించింది. ఇండియాలోనే కాదు ఏకంగా అమెరికాలోనూ హైటెక్ వ్యభిచారం చేస్తున్నారని.. ఈవెంట్స్ కోసం అమెరికాకు వెళ్లే మన హీరోయిన్స్ మాత్రమే కాదు.. యాంకరింగ్ చేసేందుకు వెళ్లే టాప్ యాంకర్స్ కూడా వ్యభిచారం రొంపిలోకి ఇరుక్కున్నారని లాస్య సంచలన ఆరోపణలు చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now