Allu Arjun : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలే వేరు. గంగోత్రి చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమై ఇతను హీరోనా అనే రేంజ్ నుంచి హీరో అంటే ఇలా ఉండాలి అనే రేంజ్ కి ఎదిగాడు అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు ఉన్నా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే యూత్ లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది. సుకుమార్ దర్శకత్వంలో ఆర్య చిత్రంతో యువత మనసులను కొల్లగొట్టాడు అల్లు అర్జున్.
ఆ తరువాత బద్రీనాథ్, దేశముదురు, జులాయి వంటి చిత్రాలతో రేసుగుర్రంలా దూసుకుపోతూ అగ్రస్థాయి హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలాంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేసినా స్టైలిష్ గానే ఉంటుంది. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప చిత్రంతో దేశ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. పుష్ప రాజ్ తగ్గేదేలే అంటూ దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాడు.
కెరీర్ లో ఫుల్ సక్సెస్ తో దూసుకుపోతున్న టైంలోనే అల్లు అర్జున్.. స్నేహ రెడ్డి ని 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదటి చూపుతోనే స్నేహ రెడ్డితో ప్రేమలో పడిపోయిన అల్లు అర్జున్ ఇంటర్ క్యాస్ట్ కావడంతో ఇంట్లో తండ్రి అరవింద్ ను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అల్లు అర్జున్ రేంజ్ కి తగ్గట్టు స్నేహ రెడ్డి కూడా ఎంతో అందంగా హీరోయిన్లను తలదన్నే విధంగా ఉంటుంది. ఆమెను చూసిన బన్నీ తల్లి పెళ్లికి ముందు స్నేహారెడ్డికి కొన్ని కండిషన్స్ పెట్టింది అని వార్తలు వైరల్ గా మారాయి.
ఇంతకీ స్నేహ రెడ్డికి బన్నీ తల్లి పెట్టిన కండిషన్స్ ఏంటంటే.. మొదటి నుంచి చలాకీ అయిన స్నేహను చూసి.. పెళ్లి అయిన తర్వాత మా అబ్బాయిని ఎంతో ప్రేమగా చూసుకోవాలి. గ్లామర్ పాడైపోతుందని పిల్లలను కనడం ఆలస్యం చేయకూడదు. పెళ్లైన మొదటి ఏడాదిలోనే నా చేతిలో మనవడినో, మనవరాలి నువ్వు కచ్చితంగా పెట్టాలి అంటూ స్నేహా రెడ్డికి కండిషన్ పెట్టిందట అత్తగారు. ఇక స్నేహ కండిషన్స్ అన్ని ఒప్పుకోవడంతో ఎంతో గ్రాండ్ గా అల్లు అర్జున్ స్నేహ రెడ్డి వివాహం జరిగింది. స్నేహా రెడ్డి కూడా అత్త గారికి ఇచ్చిన మాట తప్పకుండా మొదటిగా కొడుకు అయాన్ ని, తర్వాత కూతురు అర్హ జన్మనిచ్చి అత్తగారి కోరికను నెరవేర్చింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…