Alia Bhatt : ఆ హీరోయిన్లు ఇద్ద‌రూ పురుషుల బాత్‌రూమ్‌లోకి దూరారు.. అందుకోస‌మేన‌ట‌..!

January 31, 2022 10:20 AM

Alia Bhatt : దీపికా ప‌దుకొనె ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తోంది. ఆమె న‌టించిన గెహ్రాయియా అనే సినిమాలో ముద్దు సీన్ల‌తో రెచ్చిపోయింది. సిద్దాంత్‌తో క‌లిసి ఒక రేంజ్‌లో రొమాన్స్ చేసింది. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఆమెను విమ‌ర్శించారు. పెళ్లి అయ్యాక కూడా ఇంత‌లా రెచ్చిపోతున్నావేంటి ? అని ప్ర‌శ్నించ‌గా.. క‌థ డిమాండ్ మేర‌కే అలా చేయాల్సి వ‌చ్చింద‌ని.. దీపికా ప‌దుకొనె చెప్పుకొచ్చింది.

Alia Bhatt and Deepika Padukone shared funny incident
Alia Bhatt Deepika Padukone

ఇక తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని దీపికా వెల్ల‌డించింది. తాను, ఆలియా భ‌ట్ ఓసారి కోల్డ్ ప్లే కాన్స‌ర్ట్‌కు వెళ్లామ‌ని.. అయితే అక్క‌డ మ‌హిళ‌ల బాత్ రూమ్ వ‌ద్ద క్యూ చాలా ఎక్కువ‌గా ఉంద‌ని తెలిపింది. ఈ క్ర‌మంలో త‌న‌కు మూత్రం అర్జెంట్ అయింద‌ని.. అందుక‌నే తాను, ఆలియా భ‌ట్ ఇద్ద‌రం క‌లిసి అక్క‌డే ఉన్న పురుషుల బాత్‌రూమ్‌లోకి దూరామ‌ని తెలిపింది.

Alia Bhatt : శుభ్రంగా ఉంటే చాలు..

శుభ్రంగా ఉంటే చాలు, ఏ బాత్‌రూమ్‌లోకి అయినా పోవ‌చ్చు, ఆ స‌మ‌యంలో మాకు వేరే ఆప్ష‌న్ లేదు, అందుక‌నే అలా చేశాం.. అని దీపికా తెలిపింది. ఇదే సంఘ‌ట‌న గురించి ఆమె కాఫీ విత్ క‌ర‌ణ్ అనే టాక్ షోలోనూ తెలియ‌జేసింది. కాగా గెహ్రాయియా మూవీలో అన‌న్య పాండే న‌టించింది. ఇందులో ధైర్య కార్వా, న‌సీరుద్దీన్ షా, ర‌జ‌త్ క‌పూర్‌లు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయ‌నున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now