Akhanda 2 : అఖండ 2 వ‌చ్చేది అప్పుడే.. డేట్ ఫిక్స్ అయిన‌ట్లే..?

June 25, 2022 6:39 PM

Akhanda 2 : నంద‌మూరి బాల‌కృష్ణ చాలా రోజుల త‌రువాత అఖండ మూవీతో మ‌ళ్లీ స‌క్సెస్ బాట ప‌ట్టారు. దీంతో బాల‌య్య అభిమానుల జోరు మామూలుగా లేదు. అఖండ చాలా పెద్ద హిట్ కావ‌డంతో ఆయ‌న అభిమానులు ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మూవీ ఏకంగా 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. క‌రోనా అనంత‌రం వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈ సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించారు. ఇందులో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. సినిమా విజ‌యంలో అదే కీల‌క‌పాత్ర పోషించింద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే అఖండ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2 ఉంటుంద‌ని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా.. అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి చిత్ర యూనిట్ తాజాగా ఒక హింట్ అయితే ఇచ్చింది.

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో త‌న 107వ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ అనంత‌రం అనిల్ రావిపూడితో 108వ సినిమా చేస్తారు. ప‌క్కా కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ జోన‌ర్‌ల‌లో ఈ మూవీ ఉంటుంది. ఇక ఈ మూవీ కూడా అయ్యాకే అఖండ 2 ఉంటుంద‌ని తేల్చారు. త‌న 109వ సినిమాగా అఖండ 2 ఉంటుంద‌ని చెప్పేశారు. ఈ క్రమంలోనే ఈ మూవీని 2024 ఎన్నిక‌ల‌కు ఒక‌టి లేదా రెండు నెల‌ల ముందు రిలీజ్ చేస్తార‌ని అంటున్నారు.

Akhanda 2 reportedly will release in 2024
Akhanda 2

అప్ప‌ట్లో.. అంటే.. 2014లో ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చిన లెజెండ్ మూవీ టీడీపీకి కాస్త బూస్టింగ్ అయితే ఇచ్చింది కానీ మ‌రీ అంత పెద్ద ప్ర‌భావం చూపించ‌లేదు. కానీ అఖండ 2 ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా సినిమాను చిత్రీక‌రిస్తార‌ని తెలుస్తోంది. అందుకు గాను ద‌ర్శ‌కుడు బోయ‌పాటి ఇప్ప‌టి నుంచే క‌థ‌ను చాలా ప‌క‌డ్బందీగా సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే 2024 ఎన్నిక‌ల వ‌ర‌కు అఖండ 2 రిలీజ్ అవుతుంద‌ని తెలుస్తోంది. అయితే 107, 108 సినిమాల త‌రువాత బాల‌కృష్ణ ఇంకేదైనా మూవీ చేస్తారా.. లేక నేరుగా అఖండ 2నే చేస్తారా.. అన్న విష‌యంలో మాత్రం ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. కానీ అఖండ 2కే ఆయ‌న మొగ్గు చూపే చాన్స్ ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఈ విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment