గురువారం, జూన్ 11, 2026
టెక్నాల‌జీ

రూ.349, రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ల‌కు మార్పులు చేసిన ఎయిర్‌టెల్‌.. ఇక‌పై మ‌రింత డేటా, వాలిడిటీ..

టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ త‌న వినియోగ‌దారుల‌కు అందిస్తున్న రూ.349, రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ల‌కు గాను ప‌లు మార్పులు చేర్పులు చేసింది. ఈ రెండు ప్లాన్ల‌కు ఇక‌పై మ‌రింత డేటా ల‌భించ‌నుంది. అలాగే వీటి వాలిడిటీని కూడా పెంచారు.…

రూ.349, రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ల‌కు మార్పులు చేసిన ఎయిర్‌టెల్‌.. ఇక‌పై మ‌రింత డేటా, వాలిడిటీ..

టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ త‌న వినియోగ‌దారుల‌కు అందిస్తున్న రూ.349, రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ల‌కు గాను ప‌లు మార్పులు చేర్పులు చేసింది. ఈ రెండు ప్లాన్ల‌కు ఇక‌పై మ‌రింత డేటా ల‌భించ‌నుంది. అలాగే వీటి వాలిడిటీని కూడా పెంచారు.

airtel revised rs 349 and rs 299 prepaid plans

రూ.349 ప్లాన్ ద్వారా ఇక‌పై యూజ‌ర్లకు రోజుకు 2.50 జీబీ డేటా ల‌భిస్తుంది. గ‌తంలో 2జీబీ మాత్ర‌మే ల‌భించేది. అలాగే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ల‌భిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల‌ను ఉచితంగా వాడుకోవ‌చ్చు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ షిప్‌, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, ఫ్రీ హ‌లోట్యూన్స్‌, వింక్ మ్యూజిక్ లైబ్ర‌రీకి ఉచిత యాక్సెస్ ల‌భిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణ‌యించారు.

అలాగే రూ.299 ప్లాన్‌లో గ‌తంలో 28 రోజుల వాలిడిటీ ఉండేది. దాన్ని 30 రోజుల‌కు పెంచారు. దీంతోపాటు యూజ‌ర్ల‌కు 30జీబీ ఉచిత డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి