Adi Purush : ఆదిపురుష్ అప్‌డేట్‌.. రావ‌ణుడి యుద్ధం ముగిసింది..

October 9, 2021 1:46 PM

Adi Purush : ప్ర‌భాస్‌, కృతిస‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆదిపురుష్‌. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను, దేవదత్తా హనుమంతుడి పాత్రను చేస్తున్నాడు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ 11న చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

Adi Purush update saif alikhan leaves set

ఆదిపురుష్ చిత్రం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతుండ‌గా, ఈ సినిమాకు ఆరంభంలోనే ఆటంకం ఎదురైందన్న సంగతి తెలిసిందే. మొదటి రోజే షూటింగ్ సెట్‌లో అగ్ని ప్రమాదం ఏర్పడింది. ఆ త‌ర్వాత కరోనా వ‌ల‌న కొద్ది రోజులు అవాంతం ఏర్ప‌డింది. ఇప్ప‌డు ప‌రిస్థితులు మ‌ళ్లీ అనుకూలిస్తుండ‌డంతో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. తాజాగా సైఫ్‌ అలీఖాన్ కు వీడ్కోలు పలుకుతూ, సెట్ లో కేక్ కట్ చేశారు. ఆ ఫోటోలను దర్శకుడు ఓంరౌత్ శనివారం ట్వీట్ చేశారు. సైఫ్ తో షూటింగ్ ఎంతో వినోదాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.

‘తానాజీ’ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ‘ఆదిపురుష్’ కోసం వర్క్ చేయడం విశేషం. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నానని సైఫ్ సైతం పేర్కొన్నాడు. ముంబై నగర శివారు ప్రాంతంలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో దీనికి సంబంధించిన చిత్రీకరణ వేగంగా జరుగుతుందని సమాచారం. పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘ఆదిపురుష్’ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఐదు భాషల్లో ఇది తెరకెక్కుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment