Actress Chaurasia : టాలీవుడ్ సినీ నటి శాలు చౌరాసియాపై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో నిందితుడ్ని పోలీసులు వెంటనే గాలించారు. ఈ దాడిలో నటి చౌరాసియాతో నిందితుడు అసభ్యంగా బిహేవ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె పెదాలు, మెడపై గాయాలున్నాయి. అలాగే నిందితుడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో నటి చౌరాసియా ముఖంపై గుద్దినట్లు ఆమె తెలియజేసింది. ఆమెను చెట్ల పొదల్లోకి నిందితుడు లాకెళ్లడానికి ట్రై చేశాడని పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో నటి చౌరాసియాపై కాలి మడమకు ఫ్రాక్చర్ అయ్యిందని అంటున్నారు. ఈ నిందితుడు ఒక సైకోగా అంచనా వేస్తున్నారు. కేబీఆర్ పార్క్ లో జాగింగ్ కు వెళ్ళిన చౌరాసియాపై సైకో దాడి చేశాడు.
ప్రస్తుతం స్టార్ బక్స్ ఎదురుగా ఉన్న ఈ ప్లేస్ ఎన్నో దారుణాలకు వేదికగా మారిందని పోలీసుల సమాచారం. అందుకే వాకింగ్ కి వెళ్ళేవారు కాస్త అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కొండాపూర్ లో నివసిస్తున్న శాలు చౌరాసియా.. తెలుగు, తమిళం సినిమాల్లో యాక్ట్ చేసింది.
ఆమె ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు కేబీఆర్ పార్కుకు వాకింగ్ కు వెళ్లింది. ఇంతలో ఆ సైకో వచ్చి ఆమె మూతికి గుడ్డ కట్టి లాకెళ్లడానికి ప్రయత్నించాడు. పోలీసుల ఎంక్వయిరీలో ఆ నిందితుడు సైకోగా నిర్ధారణ అయ్యింది. అతన్ని వెతికి పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ పార్క్ చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాల్లోనూ అతని ఆచూకీ కోసం వెదుకుతున్నారు. అనుకోని ఈ ఘటన జరగడంతో శాలు చౌరాసియా తీవ్రంగా షాక్ అయినట్లు తెలుస్తోంది. ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…