mythology

Karma Phalalu : పూర్వ జ‌న్మ క‌ర్మ ఫ‌లాలు ఈ జ‌న్మ‌లో ఎలా ప్ర‌భావం చూపుతాయో తెలుసా..?

Karma Phalalu : ఒక రాజు ఉండేవారు. ఆ రాజు శివ భక్తుడు. శివుడి మీద ఉన్న భక్తితో కోటలో శివాలయాన్ని కట్టించాడు. పైగా బ్రాహ్మణుడిని పెట్టి రోజూ పూజలు జరిపించేవాడు. ఆ బ్రాహ్మణుడు కూడా భక్తి శ్రద్ధలతో రోజూ పూజలు చేసేవాడు. ఆ బ్రాహ్మణుడి భక్తికి మెచ్చి రాజు విలువైన కానుకలని పిలిచి ఇచ్చారు. కానీ వాటిని స్వీకరించకుండా తిరస్కరించాడు. ఆ బ్రాహ్మణుడు కేవలం అతనికి ఉన్న దానితోనే తృప్తి పడేవాడు. కాలం గడిచింది. ఒకరోజు మహారాజుకి కొడుకు పుట్టాడు. ఆ మహారాజు తన కొడుకుకి విద్యలన్నీ నేర్పించాడు.

ఆ తర్వాత యవ్వన వయసు వచ్చాక, అందమైన స్త్రీ తో పెళ్లి చేశారు. పెళ్లయింది. ఒక రోజు రాజకుమారికి నిద్ర రాలేదు. యువరాజు చూస్తే నిద్రపోతున్నాడు. నిద్ర రాక ఆమె ఆ గదిలోనే అటు ఇటు తిరుగుతూ ఉంటే.. ఒక రత్నాల కత్తి కనపడింది. రత్నాలతో ఉండడం వలన కత్తి ఒక్కసారే మెరిసింది. భయపడి యువరాణి ఆ కత్తిని విసిరేసింది. నేరుగా కత్తి యువరాజు కంఠం దగ్గర పడేసరికి మెడ తెగిపోయింది. ఇలా యువరాజు చనిపోయాడు.

తన కారణంగా భర్త చనిపోయాడని తెలిస్తే, ఉరి శిక్ష వేస్తారని ఆమె భయపడింది. మరుసటి రోజు ఉదయం ఆమె ఏడవడం మొదలు పెట్టింది. ఎవరో నా భర్తను చంపేశారని చెప్పింది. దాంతో రాజు వచ్చి ఏమైందని అడుగుతాడు. ఎవరో చంపేశారు నా భర్తని అని చెప్తుంది. ఎవరు చంపారో చెప్పమని రాజు అడుగుతాడు. నేను అతన్ని సరిగ్గా చూడలేదు. కానీ శివాలయం వైపు వెళ్ళాడని యువరాణి చెప్తుంది. శివాలయం వైపు అందరూ వెళ్తారు. అక్కడ ఎవరూ కనిపించరు. కేవలం బ్రాహ్మణుడు మాత్రం పూజలు చేస్తూ ఉంటాడు.

Karma Phalalu

బ్రాహ్మణుడిని భటులు పట్టుకుని మహారాజుని నువ్వే కదా అని అడుగుతారు. నేను తనని చంపలేదు. నాకే ఏ పాపం తెలియదు అని బ్రాహ్మణుడు చెప్తాడు. కానీ ఎవరూ నమ్మరు. రాజు తన కొడుకు చనిపోయాడని బ్రాహ్మణుల దగ్గరికి వెళ్లి.. నిన్ను నేను చంపలేను. కానీ ఏ చేత్తో అయితే నువ్వు నా కొడుకుని చంపావో అదే చెయ్యిని నేను నరికి వేస్తానని అత‌ని చెయ్యి నరికేస్తాడు. దీంతో బ్రాహ్మణుడు చాలా బాధపడతాడు.

నిర్దోషిని నేను. అయినా కూడా నాకు శిక్ష వేశారు. ఇక్కడ నేను ఉండను అని బ్రాహ్మణుడు మరొక రాజ్యానికి వెళ్ళిపోతాడు. బ్రాహ్మణుడు ఎందుకు నాకు ఈ శిక్ష పడింది. నేను చేయలేదు కదా దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలని ఒక జ్యోతిష్యుడు దగ్గరికి వెళ్తాడు. ఒక జ్యోతిష్యుడి ఇంటికి వెళ్లి అడుగుదామనుకునేసరికి జ్యోతిష్యుడు అక్కడ ఉండదు. ఆయన భార్య ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆ జ్యోతిష్యుడు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి భార్య అతని మీద గట్టిగా కేకలు వేస్తుంది. ఎంత తిడుతున్నా కూడా ఒక్క మాట కూడా అనడు ఆ జ్యోతిష్యుడు.

అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎందుకు ఎంత తిడుతున్నా మీరు మాట్లాడటం లేదు అని అడుగుతాడు. ఆమె నా భార్య క‌దా. అది నేను చేసిన కర్మ. మనం చేసిన కర్మ వల్ల ఏ సంబంధాలైనా వస్తాయి. అనుభవించాలి. మంచైనా, చెడైనా మనమే అనుభవించాలి అని అంటాడు. మరి మీరు చేసిన పాపం ఏమిటి అని అడగగా…. నేను పూర్వ జన్మలో కాకి. నా భార్య గాడిద. ఆ గాడిదకి ఒక పుండు ఏర్పడింది. ఆ పుండును నేను నా ముక్కుతో పొడిచినప్పుడు గాడిదకి నొప్పి బాగా వచ్చేది. గట్టిగా అరిచింది. గాడిద పుండుకి నా ముక్కు అందులో చిక్కుకుపోవడంతో ఎంతలా ప్రయత్నం చేస్తున్నా రాలేదు.

ఎముకలో ఇరుక్కుపోయింది. నొప్పి తట్టుకోలేక గాడిద గంగా నది లోకి వెళ్ళింది. ఇలా గంగా నదిలో కాకి, గాడిద రెండు చనిపోయాయి. మరి నాకు ఇలా జరిగింది అని జ్యోతిష్యుడు తనకు జరిగింది చెప్తాడు. త‌రువాత మ‌ళ్లీ జ్యోతిష్యుడు పూర్వజన్మలో నువ్వు మునివి. రాజకుమారి ఆవు. రాజకుమారుడు ఓ కసాయివాడు. ఆవుని చంపడానికి రాజకుమారుడు వచ్చినప్పుడు ఆవు ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతుంది.

కత్తి పట్టుకుని కసాయివాడు దాని వెనకాల వస్తున్నాడు. ఎక్కడికి వెళ్లిందని అడిగితే నువ్వు వేలును చూపించావు. దాంతో కసాయి వాడు ఆవు వెనుక వెళ్ళాడు. ఇంతలో సింహం వచ్చి ఆవుని, కసాయి వాడిని తినేసింది. ఈ జన్మలో కసాయివాడు రాజకుమారుడుగా, ఆవు రాణిగా పుట్టారు. నువ్వు చేసిన కర్మ వల్లే నీకు ఇలా జరిగింది అని ఆ బ్రాహ్మణుడితో చెప్తాడు. ఇలా ఎవ‌రు చేసిన క‌ర్మ‌ల‌కు మ‌ళ్లీ జ‌న్మ‌లో వారు ఫ‌లాల‌ను అనుభ‌వించాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 చిత్రం విడుద‌ల‌కు ముందే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. ఈ…

Wednesday, 18 March 2026, 5:54 PM