Arjuna : అర్జునుడి గురించి తెలియని వారు ఉండరు. చాలామందికి అర్జునుడి గురించి కొన్ని విషయాలైనా తెలిసే ఉంటాయి. అయితే అర్జునుడి గురించి చాలామందికి తెలియని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృష్ణుడు, అర్జునుడు బంధువులే కాదు. కృష్ణుడు, అర్జునుడు మంచి స్నేహితులు కూడా. వీళ్ళిద్దరూ కలిసి గొప్ప విజయాలని అందుకున్నారు. కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం అప్పుడు అర్జునుడికి సారథిగా ఉండడమే కాకుండా అనేక సందర్భాలలో మరణం నుండి అర్జునుడిని కాపాడాడు.
కలకాలం వీళ్ళ మధ్య స్నేహం కొనసాగింది. అప్పట్లో చాలామంది స్త్రీలు వాళ్ళ హృదయాన్ని అర్జునుడికి అర్పించారు. కానీ ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. ద్రౌపది, సుభద్ర, చిత్రాంగద, ఉలూపి మాత్రమే అతనిని పెళ్లి చేసుకోవడం జరిగింది. వాళ్లే అదృష్ట స్త్రీలు. సర్ప యువరాణి ఉలూపి అర్జునుడిని ప్రేమిస్తుంది. కానీ సర్ప యువరాజు అశ్వసేనకి నచ్చలేదు. చంపడానికి ప్రయత్నిస్తాడు. నరకపు జ్వాలల నుండి ఉలూపి అర్జునుడిని కాపాడడం, తర్వాత ఆమె తన జీవితాన్ని అర్జునుడికి ఇవ్వడం జరిగిపోతాయి.
రామేశ్వరం దర్శించి అక్కడ రాముడు వానరులతో కలిసి లంకకు నిర్మించిన వారధిని చూసి.. ఈ వారధి నిర్మించుటకు ఇంత కష్టం ఏల..? నేను ఈ వారధిని నిమిషంలో నిర్మించగలనని అర్జునుడు అంటాడు. ఓ కోతి పిల్ల నీవు నిర్మించు. నేను దానిమీద నిలబడతాను. అలా నిర్మించిన వారధి పడిపోకుండా ఉంటే, నేను నీకు బానిసత్వము చేసెదను. పడిపోయి ఉంటే నీవు నాకు చేయాలి.. అంటుంది. అర్జునుడు పరిహాసముగా వెంటనే వారధిని నిర్మించగా, ఆ కోతి పిల్ల అడుగు వేయగానే వారధి కూలిపోయింది. మళ్లీ నిర్మిస్తే, మళ్లీ కోతి పిల్ల విరగ్గొడుతుంది.
అర్జునుడు ఓడిపోయానని ఒప్పుకుని ఆ కోతికి బానిసత్వము చేయబోవుటకై సంసిద్ధుడు కాగా ఓ బ్రాహ్మణ బాలుడు అక్కడికి వచ్చి, విషయం గ్రహించి మధ్యవర్తిత్వము లేని పందెం న్యాయబద్ధం కాదని, నేను మధ్యవర్తిగా వుంటాను. మీరు మరలా పందెం కొనసాగించాలని కోరుతాడు. అందుకు ఇద్దరూ సమ్మతించుగా అర్జునుడు వారధిని నిర్మిస్తాడు. ఆ వానరుడు తన శరీరమును ఎంత పెంచినా అది విరగలేదు. అర్జునుడు, ఆ కోతి ఆశ్చర్యపోయారు. ఆ బ్రాహ్మణ బాలుడు శ్రీకృష్ణుడని, ఆ వానరం ఆంజనేయుడని అర్జునుడు గ్రహిస్తాడు. శ్రీకృష్ణుని కోరిక మేరకు అర్జునుడి రథం జెండాపై ఆంజనేయుడు ఉండడానికి అంగీకరిస్తాడు. ఈ తీర్థయాత్ర సమయంలోనే అర్జునుడు ద్వారకకు వెళ్లి సుభద్రని పెళ్లి చేసుకుంటాడు. వారికి అభిమన్యుడు పుడతాడు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…