Print Currency : గుండు సూది దగ్గర్నుంచి.. విమానం దాకా.. నిరుపేదల నుంచి ధనికుల దాకా.. అందరిని నడిపిస్తుందీ.. అందరికీ కావల్సిందీ.. ఒక్కటే.. డబ్బు.. డబ్బు లేనిదే ఈ ప్రపంచంలో ఏ పనీ కాదు. మనిషి డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు. పేదవాడు ఒక్క పూట తిండి కోసం డబ్బు సంపాదించాలని చూస్తాడు. ధనికులు ఖజానాల్లో ఉన్న తమ ధనం రెట్టింపు కావాలని చూస్తుంటారు. అయితే.. ప్రపంచంలోని దేశాలన్నీ.. తమకు కావల్సినంత కరెన్సీని ప్రింట్ చేసుకుని.. పేదలందరికీ పంచవచ్చు కదా.. అప్పుడు పేదలంటూ ఉండరు కదా.. ఈ కష్టాలు, కన్నీళ్లు ఉండవు కదా.. అని కొందరు ఆలోచిస్తుంటారు. ప్రభుత్వాలు అలా ఎందుకు చేయవు..? అని కొందరు ప్రశ్నిస్తుంటారు. అయితే అందుకు సమాధానాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా ఏ దేశమైనా సరే.. కరెన్సీ ముద్రణలో కొన్ని పాలసీలను ఏర్పాటు చేసుకుంటాయి. ఇక మన దేశం కూడా అంతే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మన దేశంలో ఎంత నగదు ఉందీ, ఎంత ముద్రించాలి.. అన్న వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. కరెన్సీని ముద్రించి చెలామణీలోకి తెస్తుంది. మన దేశంలో ప్రభుత్వం వద్ద ఉన్న మొత్తం బంగారు నిల్వల ఆధారంగా కరెన్సీ ముద్రణ అనేది జరుగుతుంది. ఇక ఇతర దేశాల వారు కూడా తమ పాలసీల ప్రకారం కరెన్సీని ముద్రిస్తుంటారు. కానీ ఎవరూ.. అతిగా కరెన్సీని ముద్రించరు. ఎందుకంటే..
ఉదాహరణకు మన దేశంలో పెద్ద ఎత్తున కరెన్సీని ముద్రించి అందరికీ కొన్ని లక్షల రూపాయలను ఇచ్చారనుకుందాం.. అప్పుడేమవుతుంది. అందరూ.. ధనికులు అవుతారు.. సహజంగానే జనాల్లో పనిచేసే తత్వం పోతుంది. ఆహార, వస్తువుల ఉత్పత్తి తగ్గుతుంది. డిమాండ్ పెరుగుతుంది. ధరలు పెరుగుతాయి. అలా కొంత కాలం నడుస్తుంది.. ఆ తరువాత ఆహారం దొరకదు. ఒక్క తిండి గింజ కోసం తన్నుకునే రోజులు వస్తాయి.. ఇది అసలు ఏమాత్రం మంచిది కాదు. గతంలో జింబాబ్వే కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. అక్కడ అవసరం లేకున్నా పెద్ద ఎత్తున కరెన్సీని ముద్రించారు. ఉత్పత్తి తగ్గింది. ద్రవ్యోల్బణం పెరిగింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.
అలాగే ఏ దేశంలో అయినా సరే.. అవసరానికి మించి కరెన్సీని ముద్రించి చెలామణీ చేస్తే.. జింబాబ్వేలో జరిగినట్లే పరిస్థితులు ఏర్పడతాయి. ఉత్పత్తి తగ్గి అన్నింటి ధరలు పెరుగుతాయి. అప్పుడు రూ.10 ఉండే బియ్యం ధర ఏకంగా రూ.100 అవుతుంది.. దీంతో ప్రజల వద్ద ఉన్న సంపద వస్తువులను కొనుగోలు చేసే కొద్దీ తరిగిపోతుంది.. అప్పుడు ప్రజలందరూ మునుపటి కన్నా ఇంకా పేదరికంలోకి వెళ్లిపోతారు. అలాంటప్పుడు కరెన్సీని ఎక్కువగా ముద్రించి.. అందరికీ పంచాల్సిన అవసరం లేదు కదా.. అందుకనే ప్రభుత్వాలు ఆ పని చేయడం లేదు.. చేయవు కూడా.. అది ప్రజలకే కాదు, దేశ భవిష్యత్తుకూ అనర్థదాయకం.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…