10000 Steps Per Day : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం కూడా చేయాలన్న సంగతి తెలిసిందే. అయితే వ్యాయామాలన్నింటిలోకెల్లా వాకింగ్ అనేది చాలా తేలికైన, సులభమైన వ్యాయామం. ఇందుకు ఎలాంటి డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఇంటి దగ్గరే సరైన ప్రదేశంలో రోజూ వీలు కుదిరిన సమయంలో వాకింగ్ చేయవచ్చు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలని వైద్య నిపుణులు కూడా సూచిస్తుంటారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా వాకింగ్‌ను చాలా సులభంగా చేయవచ్చు. దీని వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
అయితే రోజూ మనం కనీసం 10వేల అడుగుల దూరం అయినా సరే వాకింగ్ చేయాలట. ఈవిధంగా వాకింగ్ చేస్తే మనకు ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణంగా రోజూ చాలా మంది 30 నిమిషాలు లేదా ఒక గంటపాటు వాకింగ్ చేస్తారు. అలా కాకుండా 10వేల అడుగుల దూరం నడిస్తే చాలు. ఇందులో సమయపాలన పాటించాల్సిన పనిలేదు. ఈ మొత్తం దూరాన్ని మీ ఇష్టం వచ్చినంత సమయంలోగా పూర్తి చేయవచ్చు. ఇక 10వేల అడుగులు నడిచామని ఎలా తెలుస్తుంది అంటే మనకు ఫోన్ ఉందిగా. అందులో పెడోమీటర్ యాప్స్ ఉంటాయి. లేదా స్మార్ట్‌వాచ్, స్మార్ట్ బ్యాండ్ వంటివి కూడా వాడవచ్చు. వీటి సహాయంలో మనం ఎన్ని అడుగుల దూరం నడిచామో సులభంగా తెలిసిపోతుంది. దీంతో రోజూ 10వేల అడుగుల దూరాన్ని సులభంగా నడవవచ్చు. ఇక ఈ విధంగా వాకింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ 10వేల అడుగుల దూరం వాకింగ్ చేస్తే ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది. దీంతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మారుతాయి. ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు బయటకుపోతాయి. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. ఇక రోజూ 10వేల అడుగులు నడిస్తే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.
రోజూ కనీసం 10వేల అడుగుల దూరం నడిచే వారిలో స్ట్రోక్స్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని సైంటిస్టులు తేల్చారు. రోజూ ఈ విధంగా వాకింగ్ చేయడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది. షుగర్ ఉన్నవారిలో ఆ లెవల్స్ గణనీయంగా తగ్గుతాయి. డయాబెటిస్ కచ్చితంగా అదుపులోకి వస్తుంది. అధిక బరువు త్వరగా తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కడిగేసినట్లు ఇట్టే కరిగిపోతుంది. మూడ్ మారుతుంది, మనస్సు, మైండ్ రిలాక్స్ అవుతాయి. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి తగ్గుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక రోజూ కనీసం 10వేల అడుగులు నడిచే ప్రయత్నం చేయండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…