Anger : మనుషులకు కలిగే అనేక రకాల భావాల్లో కోపం కూడా ఒకటి. మనలో అనేక మంది చాలా సందర్భాల్లో కోపానికి గురవుతుంటారు. కొన్ని సార్లు పట్టలేనంత కోపం వస్తుంది. కొన్ని సార్లు కోపం తక్కువగా వస్తుంది. అయితే కోపం విషయానికి వస్తే.. ఎత్తు తక్కువగా ఉండే వారికే కోపం ఎక్కువగా వస్తుందట. బాగా పొడవుగా ఉండే వారికి కోపం తక్కువగా వస్తుందట. అవును, ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు. సైంటిస్టుల పరిశోధనలే చెబుతున్నాయి. ఇంతకీ అసలు విషయమేమిటంటే..
అట్లాంటాలోని సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ వారు ఈ మధ్యే 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 600 మంది పురుషులను ప్రశ్నించారు. డ్రగ్స్ తీసుకోవడం, నేరాలకు పాల్పడడం, కోపం రావడం తదితర అంశాల గురించి సైంటిస్టులు వారిని ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. చివరకు సైంటిస్టులు ఏం తేల్చారంటే ఎత్తు తక్కువగా ఉన్నవారికే కోపం ఎక్కువగా వస్తుందట. పొడవుగా ఉన్నవారికి కోపం తక్కువగా వస్తుందని తేల్చారు.
అయితే ఎత్తు తక్కువగా ఉన్నవారికి కోపం బాగా రావడానికి వెనుక ఉన్న కారణాలను కూడా సైంటిస్టులు వివరిస్తున్నారు. సాధారణంగా పొట్టిగా ఉన్నవారు చిన్నతనంలో ఎత్తు తక్కువగా ఉన్నందుకు ఇతరుల చేతుల్లో హేళనకు గురయ్యే సందర్భాలు ఎక్కువట. పొట్టిగా ఉన్నారని చెప్పి అలాంటి వారిని ఇతరులు బాగా ఏడిపిస్తారట. అందుకనే వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎత్తు తక్కువగా ఉన్నవారికి ఓ రకమైన కాంపెక్ల్స్ డెవలప్ అవుతుందట. దాన్నే నెపోలియన్ కాంప్లెక్స్ అంటారట. ఈ స్థితిలో ఉన్నవారికి సహజంగానే కోపం ఎక్కువగా ఉంటుందట.
ఇక వారిని ఉద్రేకానికి గురి చేసే సంఘటనలైతే ఇంకా మరింత కోపోద్రిక్తులు అవుతారట. అదీ.. ఎత్తు తక్కువగా ఉన్నవారికి కోపం బాగా వచ్చేందుకు గల అసలైన కారణం. అయితే ఎత్తు తక్కువగా ఉన్నంత మాత్రాన అందరికీ కోపం బాగా వస్తుందని కాదు. కొందరు పొడవుగా ఉండేవారు కూడా తీవ్రమైన ఆగ్రహావేశాలకు లోనవుతుంటారు. అది వేరే విషయం. ఎంతైనా ఇది సైంటిస్టులు చేసిన పరిశోధన కదా.. ఫలితాలు అలాగే ఆశ్చర్యపరుస్తాయి.. అంతే..!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…