Self Tickling : ఏ మనిషికైనా చక్కిలిగింతలు అనేవి కామన్. ఇవి కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవు. అంతే తేడా.. కొందరు ముట్టీ ముట్టుకోకుండానే గిలిగింత పెట్టిన ఫీలింగ్ వచ్చి అదిరిపోతారు. కొందరికి చక్కిలి గింతలు ఎంత పెట్టినా ఉలుకు పలుకు ఉండదు. ఇక కొందరైతే ఓ మోస్తరు చక్కిలి గింతలు పెడితే తుళ్లి పడతారు. అయితే.. చక్కిలి గింతలు అనేవి ఎదుటి మనిషి పెడితేనే మనకు వస్తాయి. కానీ మనకు మనం చక్కిలి గింతలు పెట్టుకుంటే తుళ్లింతలు రావు.. అవును, కరెక్టే కదా.. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం..!
మన మెదడులో సెరిబెలమ్ అనే భాగం ఉంటుంది. ఇది మన శరీరంలో జరిగే స్వీయ చర్యలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉంటుంది. అంటే మన శరీర భాగాలతో మనం ఏం చేస్తున్నామో, ఏం చేయబోతున్నామో అది ముందుగానే పసిగడుతుందన్నమాట. ఈ క్రమంలో మనకు మనం చక్కిలిగింతలు పెట్టుకుంటే ఆ విషయం దానికి తెలుస్తుంది. అందువల్ల ప్రతిచర్య ఉండదు. దీంతో మనకు మనం చక్కిలిగింతలు పెట్టుకుంటే ఏమీ అనిపించదు. అదే ఇతరులు పెట్టే చక్కిలిగింతను మనం ముందుగా ఊహించలేం. అదే విషయం సెరిబెలమ్‌కు కూడా తెలియదు. దీంతో ఎదుటి వారు మనకు చక్కిలి గింత పెట్టగానే అందుకు సెరిబెలమ్ స్పందించి రియాక్షన్ ఇస్తుంది. ఎదుటి వారు చక్కిలిగింత పెట్టగానే ఉలికిపాటు ఎదురై ప్రతిచర్య వస్తుంది. దీంతో ఎదుటి వారు చక్కిలి గింత పెట్టగానే మనకు తుళ్లింత వస్తుంది.
అయితే స్కిజోఫ్రేనియా అనే వ్యాధి ఉన్నవారు తమకు తామే చక్కిలి గింత పెట్టుకుంటే మాత్రం తుళ్లింతకు లోనవుతారు. ఎందుకంటే వారి మెదడు స్వీయ చర్యలను పసిగట్టలేదు. దీంతో చక్కిలిగింత ఊహించకుండా జరుగుతుంది. ఈ క్రమంలో ప్రతిచర్య వస్తుంది. అప్పుడు తుళ్లింతకు లోనవుతారు. చక్కిలిగింతలు ఉంటాయి. కానీ సాధారణ వ్యక్తులకు మాత్రం తమకు తామే చక్కిలిగింతలు పెట్టుకుంటే.. ఏమీ కాదు. ఇక షార్క్‌లు, చింపాంజీ, గొరిల్లా, ఒరాంగ్ ఊటాన్ తదితర పలు జంతువులకు కూడా చక్కిలిగింతలు ఉంటాయట. వాటి మూతి పైభాగంలో నిమిరితే చక్కిలిగింతలు వస్తాయట. ఏది ఏమైనా.. మనం చక్కిలిగింతల ఫీలింగ్‌ను అనుభవించడం కంటే.. ఎదుటివారికి చక్కిలి గింతలను పెడితే భలే థ్రిల్లింగ్‌గా ఉంటుంది కదా..!
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…