lifestyle

Pericardial Effusion : ఈ ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తున్నాయా.. అయితే మీ గుండె చుట్టూ నీరు చేరింద‌ని అర్థం..!

Pericardial Effusion : మ‌న శ‌రీరంలోని ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో గుండె కూడా ఒక‌టి. ఇది ర‌క్తాన్ని పంపు చేస్తుంది. గుండె కొట్టుకోవ‌డం ఆగిపోతే మ‌నిషి చ‌నిపోతాడు. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మీరు క‌చ్చితంగా గుండె ఆరోగ్యంపై శ్ర‌ద్ధ వ‌హించాలి. తీసుకునే డైట్‌పై శ్ర‌ద్ధ పెట్టాలి. మీరు మీ జీవ‌న విధానం, ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా పాటించాల్సి ఉంటుంది. అయితే గుండెలో కొన్ని సార్లు నీరు చేరుతుంది. ఈ విధంగా జ‌రిగితే కొన్ని ల‌క్ష‌ణాలు మ‌న‌కు క‌నిపిస్తాయి. వాటి గురించి ఇప్పుడు మీకు మేము చెప్ప‌బోతున్నాం. సాధార‌ణంగా ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తే దీన్ని వైద్య ప‌రిభాష‌లో Pericardial Effusion అంటారు. అంటే గుండెలో నీరు చేర‌డం అన్న‌మాట‌.

Pericardial Effusion స‌మ‌స్య వచ్చిందంటే అది ఒక సీరియస్ ప్రాబ్లం అని గుర్తించాలి. దీని వ‌ల్ల గుండె చుట్టూ ఉండే ప్రాంతంలో నీరు చేరుతుంది. అయితే ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఇన్‌ఫెక్ష‌న్లు, గాయం అవ‌డం, ఇత‌ర వ్యాధులు కూడా ఇందుకు కార‌ణాలు కావ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఇలాంటి స‌మ‌స్య వచ్చిన‌ప్పుడు ఏర్ప‌డే ల‌క్ష‌ణాలను త్వ‌ర‌గా గుర్తించాల్సి ఉంటుంది. గుండె చుట్టూ ఉండే ప్ర‌దేశంలో నీళ్లు చేర‌డం వ‌ల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వ‌ల్ల గుండెకు ర‌క్తాన్ని పంపు చేయ‌డం చాలా ఇబ్బందిగా మారుతుంది. దీంతో ర‌క్త‌స‌ర‌ఫ‌రా కూడా ప్ర‌భావితం అవుతుంది.

Pericardial Effusion

ఈ సంద‌ర్భంలో మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు సంకేతాల‌ను ఇస్తుంది. తీవ్ర‌మైన ఛాతి లేదా గుండె నొప్పి, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ఎదురుకావ‌డం, ఛాతిపై బ‌రువు పెట్టిన‌ట్లు అనిపించ‌డం, గుండె కొట్టుకునే వేగం అక‌స్మాత్తుగా పెర‌గ‌డం, త‌ల‌నొప్పి, త‌ల‌తిర‌గ‌డం, క‌ళ్లు తిరిగి ప‌డిపోవ‌డం, ఆహారం తిన‌డంలో ఇబ్బంది ఎదురుకావ‌డం, ఆందోళ‌న‌, కంగారు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మీ గుండె చుట్టూ నీరు చేరింద‌ని అర్థం చేసుకోవాలి. ఈ స‌మ‌స్య వ‌చ్చేందుకు పైన చెప్పిన కార‌ణాల‌తోపాటు కొన్ని ఇత‌ర అంశాలు కూడా కార‌ణం అవుతుంటాయి.

ఇన్‌ఫెక్ష‌న్లు, గుండె వ‌ద్ద గాయం కావ‌డం, గుండె జ‌బ్బులు ఉండ‌డం, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు వంటి కార‌ణాల వ‌ల్ల కూడా Pericardial Effusion స‌మ‌స్య త‌లెత్తుతుంది. కొన్ని సార్లు వైర‌ల్‌, బాక్టీరియ‌ల్‌, ప్రొటోజోవ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు కూడా కార‌ణం అవుతుంటాయి. అలాగే క్యాన్స‌ర్ క‌ణాలు ఉండ‌డం, థైరాయిడ్ ఆటోఇమ్యూన్ వ్యాధి ఉండ‌డం, గుండెకు శ‌స్త్ర చికిత్స జ‌రిగి ఉండ‌డం, హార్మోన్ స‌మ‌స్య‌లు వంటివి కూడా ఈ స్థితికి కార‌ణాలు అవుతుంటాయి. కనుక ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయకుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లవాలి. దీంతో స‌రైన టైములో ప‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స తీసుకోవ‌చ్చు. అప్పుడు ప్రాణాంత‌కం కాకుండా చూసుకోవ‌చ్చు. దీంతో ముందుగానే ప్రాణాల‌ను ర‌క్షించుకున్న‌వార‌ము అవుతాము. కాబ‌ట్టి ఈ విష‌యంలో అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM