lifestyle

Nausea : వాంతులు, వికారం స‌మ‌స్య‌ల‌కు ఈ చిట్కాల‌తో చెక్ పెట్టేయండి..!

Nausea : వికారం అనేది మ‌న‌లో చాలా మందికి వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఒక‌టి. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. తిన్న ఆహారం ప‌డ‌క‌పోవ‌డం లేదా స‌రిగ్గా జీర్ణం కాక‌పోవ‌డం, డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌డం, నీర‌సం, ప్ర‌యాణాలు చేయ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల వికారం క‌లుగుతుంటుంది. దీంతో త‌ల తిప్పిన‌ట్లు ఉంటుంది. వాంతికి వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. అయితే వికారం నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఇంగ్లిష్ మెడిసిన్ అవ‌స‌రం లేదు. కింద తెలిపిన ప‌లు స‌హ‌జ సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే చాలు.. వికారం నుంచి ఉప‌శ‌మనం క‌లుగుతుంది. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే..

నిమ్మ‌కాయ‌ను స‌గానికి కోసి దాన్ని కొద్దిగా న‌లిపి వాస‌న చూస్తుండాలి. దీంతో వికారం త‌గ్గుతుంది. లేదా ప్ర‌తి 5, 10 నిమిషాల‌కు నాలుగైదు చుక్క‌ల నిమ్మ‌ర‌సాన్ని నోట్లో వేసుకుని మింగాలి. ఇలా చేసినా వికారం త‌గ్గుతుంది. వికారం క‌లుగుతుంటే.. చాలా సుదీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. బాగా గట్టిగా ఊపిరి పీల్చి నెమ్మ‌దిగా వ‌దులుతుండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వికారం కొంత కొంత‌గా త‌గ్గుతుంది. పుదీనా ర‌సాన్ని 1 టీస్పూన్ తాగినా లేదంటే.. పుదీనా ఆకుల‌ను వాస‌న చూసినా వికారం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Nausea

బాదంప‌ప్పు, కోడిగుడ్లు, పాల‌ను తీసుకుంటే వికారం అనిపించ‌దు. దాల్చిన చెక్క పొడిని చిటికెడు తీసుకుని అలాగే నమిలి మింగినా, లేదంటే అందులో కొద్దిగా తేనె క‌లుపుకుని మింగినా వికారం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కొన్ని సార్లు డీహైడ్రేష‌న్ వ‌ల్ల కూడా వికారంగా అనిపిస్తుంది. అలాంట‌ప్పుడు దాహం తీరేవ‌ర‌కు లేదా ప్ర‌తి 5, 10 నిమిషాల‌కు కొద్ది కొద్దిగా నీటిని తాగుతుండాలి. దీంతో వికారం త‌గ్గుతుంది. వికారం స‌మ‌స్య ఉన్న‌వారు కారం త‌గ్గించాలి. కారం ఎక్కువ‌గా తిన్నా జీర్ణాశ‌యంలో ఇబ్బంది క‌లుగుతుంది. ఫ‌లితంగా వికారం వ‌స్తుంది.

కొంద‌రు తిన్న వెంట‌నే ప‌డుకుంటారు. అలా చేయ‌రాదు. క‌నీసం 30 నిమిషాల పాటు అయినా స‌రే కూర్చుని ఉండాలి. దీంతో వికారం రాకుండా ఉంటుంది. వికారం వ‌స్తుంటే అలా బ‌య‌ట‌కు వెళ్లి కొద్దిగా చ‌ల్ల‌గాలిలో, ప్ర‌కృతిలో తిర‌గాలి. స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM