lifestyle

Hyderabad Biryani : హైద‌రాబాద్ బిర్యానీని మొద‌ట అస‌లు ఎవ‌రు వండారు.. దీని క‌థేంటి..?

Hyderabad Biryani : హైదరాబాద్ అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే అంశాల్లో.. హైదరాబాద్‌ బిర్యానీ కూడా ఒకటి. హైదరాబాద్‌లో ఘుమఘుమలాడే బిర్యానీని అందించే అనేక హోటల్స్‌, రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే మనం భాగ్యనగరంలో ఏ మూలకు వెళ్లినా ఏదో ఒక రకమైన వెరైటీ బిర్యానీ రుచిని ఆస్వాదించవచ్చు. చికెన్‌, మటన్‌, వెజ్‌, ఫిష్‌, ప్రాన్స్‌.. ఇలా రక రకాల పదార్థాలకు చెందిన బిర్యానీలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే హైదరాబాద్‌ బిర్యానీ కేవలం మనకు హైదరాబాద్‌లోనే కాదు.. ఇప్పుడు ప్రపంచంలో దాదాపుగా ఎక్కడికి వెళ్లినా ల‌భిస్తుంది. దీంతో ఇప్పుడు హైదరాబాద్‌ బిర్యానీ ఖ్యాతి ప్రపంచం నలుమూలలకు వ్యాప్తి చెందింది. అయితే అసలు ఈ బిర్యానీ నిజానికి హైదరాబాద్‌లో పుట్టిందేనా..? లేదా దీన్ని ఎవరైనా ఈ నగరానికి తీసుకువచ్చారా ? అసలు హైదరాబాద్‌ బిర్యానీ కథేంటి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మధ్య ఆసియాలో బిర్యానీ లాంటి ఓ వంటకాన్ని వండుతారు. దానికి సిండ్రెల్లా ఆఫ్‌ సెంట్రల్‌ ఏషియన్‌ పిలాఫ్‌ అని పేరు. అయితే ఇది పులావ్‌ రుచిని కలిగి ఉంటుందట. ఇదే బిర్యానీలా మారి భారత్‌కు వచ్చిందని కొందరు చెబుతారు. అయితే నిజానికి పులావ్‌ వేరు, బిర్యానీ వేరు. కాగా బిర్యానీ అన్న పదం బిరింజ్‌ బిరియాన్‌ అనే పర్షియన్‌ పదం నుంచి ఉద్భవించింది. అందుకే కొందరు బిర్యానీ ఇరాన్‌లో పుట్టిందని నమ్ముతారు. ఇరాన్‌లో ధమ్‌ బిర్యానీకి ఎంతో చరిత్ర ఉంది. ఓ కుండలో మాంసాన్ని వేసి సన్నని మంటపై చాలా సేపు ఉడికిస్తారు. అనంతరం దానిపై అన్నం, సుగంధ ద్రవ్యాలు వేసి బిర్యానీ వండుతారు.

Hyderabad Biryani

అయితే ఇరాన్‌లో ఒకప్పుడు బిర్యానీని బాగా వండినా.. రాను రాను దానికి అక్కడ ప్రాచుర్యం తగ్గడంతో దాన్ని అక్కడ వండడం మానేశారు. అయితే మరోవైపు భారత్‌లో మాత్రం బిర్యానీ దిన దిన ప్రవర్ధమానం అన్నట్లుగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దాని తయారీ విధానంలోనూ ఎన్నో మార్పులు ఇప్పటి వరకు చోటు చేసుకున్నాయి. అయితే మన దేశాన్ని పాలించిన మొఘల్‌ చక్రవర్తులు ఇరాన్‌ నుంచి బిర్యానీని మన దేశానికి తెచ్చారని కొందరు చెబుతారు. కానీ దానికి కూడా ఆధారాలు లేవు. ఇక హైదరాబాద్‌ను పాలించిన నవాబులు ఇరాన్‌ నుంచి బిర్యానీని మన నగరానికి తెచ్చారని చాలా మంది చెబుతారు.

అయితే మొదట్లో నవాబుల కుటుంబాల్లో మాత్రమే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనే బిర్యానీని వండేవారట. కానీ క్రమంగా ప్రజలకు కూడా దాన్ని పరిచయం చేశారు. ఈ క్రమంలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు బిర్యానీ తయారీలో అనేక మార్పులు జరిగాయి. బిర్యానీ తయారీలో వాడే సుగంధ ద్రవ్యాల జాబితా కూడా పెరుగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే.. మన దేశంలోని పలు రాష్ట్రాల వాసులు కూడా బిర్యానీని భిన్న రకాలుగా వండుకుని తింటారు. కేరళలో రొయ్యల బిర్యానీ, బెంగాల్‌లో ఢాకాయ్‌ బిర్యానీ చేస్తారు. అవి రుచిలో హైదరాబాద్‌ బిర్యానీని పోలి ఉంటాయి.

ఇక భోపాల్‌లో ఆఫ్ఘాన్‌ బిర్యానీ లభిస్తుంది. అలాగే యూపీలో మొరాదాబాదీ బిర్యానీ ఫేమస్‌ అయితే రాజస్థాన్‌లో అజ్మీరీ బిర్యానీ వండుతారు. ఏది ఏమైనా.. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా.. బిర్యానీ అంటే ముందుగా హైదరాబాదే గుర్తుకు వస్తుంది. అంతలా మన బిర్యానీ పాపులర్‌ అయింది. అయితే దాన్ని చేయి తిరిగిన వారు వండితేనే ఆ టేస్ట్‌ మనకు తెలుస్తుంది. ఎంతైనా.. అది హైదరాబాదీ బిర్యానీ కదా..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

లోకేష్ కనగరాజ్‌పై ఫ్యాన్స్ ఫైర్.. ‘మీకు కలెక్షన్లే కావాలా.. కథ అక్కర్లేదా?’ అంటూ నెటిజన్ల ట్రోలింగ్!

ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…

Tuesday, 27 January 2026, 9:45 AM

మీ ఫోన్ స్లోగా చార్జ్ అవుతుందా? ఈ 5 చిట్కాలతో నిమిషాల్లో ఫుల్ చార్జింగ్!

నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…

Monday, 26 January 2026, 9:44 PM

అమెజాన్ ఉద్యోగులకు షాక్.. రేపటి నుంచి 16 వేల మంది తొలగింపు? భారత్‌పైనే ఆ ప్రభావం ఎక్కువ!

అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…

Monday, 26 January 2026, 7:45 PM

తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే.. 2028లో జాగృతి పార్టీ విజయం ఖాయం: కవిత సంచలన వ్యాఖ్యలు

పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…

Monday, 26 January 2026, 5:34 PM

మెగా సక్సెస్.. మెగా గిఫ్ట్! దర్శకుడు అనిల్ రావిపూడికి రూ. 1.40 కోట్ల ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి!

అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…

Monday, 26 January 2026, 1:38 PM

గూగుల్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్స్.. డిగ్రీ, పీజీ విద్యార్థులకు అదిరిపోయే అవకాశం! అప్లికేషన్ ప్రాసెస్ ఇదే..

ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…

Monday, 26 January 2026, 10:41 AM

ఇస్రోలో భారీ నియామకాలు.. నెలకు రూ. 2.08 లక్షల జీతం! ఇంజనీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్లకు గోల్డెన్ ఛాన్స్..

ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…

Sunday, 25 January 2026, 5:28 PM

సీఎం చంద్రబాబు ‘టంగ్ స్లిప్’.. 23 లక్షల కోట్ల ఉద్యోగాలంటూ వైరల్ అవుతున్న వీడియో!

ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…

Sunday, 25 January 2026, 9:55 AM