lifestyle

Mango Chicken Curry : మామిడికాయ‌, చికెన్ క‌లిపి వండితే ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..!

Mango Chicken Curry : చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. చికెన్ తో ఎక్కువ‌గా క‌ర్రీని త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని ఒక్కొక్కరు ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. మ‌నం సుల‌భంగా, వెరైటీగా చేసుకోద‌గిన చికెన్ క‌ర్రీలల్లో మామిడికాయ చికెన్ క‌ర్రీ కూడా ఒక‌టి. మామిడికాయ‌తో చికెన్ క‌ర్రీ ఏంటి అని అనుకుంటున్నారా..? ప‌చ్చి మామిడికాయ వేసి కూడా మ‌నం చికెన్ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క‌ర్రీ పుల్ల పుల్ల‌గా, కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. వెరైటీ రుచులు కావాల‌నుకునే వారు దీనిని త‌ప్పకుండా రుచి చూడాల్సిందే. మామిడికాయ‌ల‌తో రుచిగా, క‌మ్మ‌గా చికెన్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడికాయ చికెన్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

వెల్లుల్లి రెమ్మ‌లు – 10 నుండి 12, అల్లం – ఒక ఇంచు ముక్క‌, ప‌చ్చిమిర్చి – 5 లేదా 6, నూనె – 6 నుండి 7 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, చికెన్ – అర‌కిలో, కారం – అర టేబుల్ స్పూన్ నుండి ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పు, చెక్కు తీసిన ప‌చ్చి మామిడికాయ ముక్క‌లు – పావు క‌ప్పు నుండి అర‌ క‌ప్పు ( పులుపును బ‌ట్టి), త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్.

Mango Chicken Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, ల‌వంగాలు – 5, మిరియాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక అంగుళం ముక్క‌, యాల‌కులు – 4, ఎండుమిర్చి – 4 లేదా 5, నాన‌బెట్టిన జీడిప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్.

మామిడికాయ చికెన్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో జీడిప‌ప్పు త‌ప్ప మిగిలిన మ‌సాలా ప‌దార్థాలు వేసి చిన్న మంట‌పై బాగా వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే జీడిపప్పు కూడా వేసి త‌గిన‌న్నినీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత మ‌రో జార్ లో వెల్లుల్లి రెమ్మ‌లు, అల్లం, ప‌చ్చిమిర్చి వేసి పేస్ట్ లాగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని లైట్ గోల్డెన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు బాగా వేయించాలి. ఇవి వేగుతుండ‌గానే క‌రివేపాకు కూడా వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి. దీనిని పెద్ద మంట‌పై ముక్క‌లు ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. చికెన్ ఎర్ర‌గా వేగిన త‌రువాత కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి.

ఇవి మాడిపోకుండా 3 టేబుల్ స్పూన్స్ నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిని నూనెపైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి చికెన్ ను 80 శాతం ఉడికించాలి. చికెన్ 80 శాతం ఉడికిన త‌రువాత మామిడికాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మామిడికాయ ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర‌, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. కూర ఉడికేట‌ప్పుడే రుచిని చూసుకోవాలి. మామిడికాయ పులుపు ఎక్కువ‌గా ఉంటే ఉప్పు, కారం స‌రి చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మామిడికాయ చికెన్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన చికెన్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రాముడు ఎప్పటికీ ఆదర్శమే.. లాస్ ఏంజెల్స్‌లో రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ సందడి!

శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడ‌ని న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…

Tuesday, 31 March 2026, 10:49 PM

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని…

Tuesday, 31 March 2026, 8:28 PM

థియేటర్లలో మిస్ అయ్యారా? ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘హే భగవాన్’.. ఎక్కడ చూడాలంటే?

థియేట‌ర్ల‌లో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు.…

Tuesday, 31 March 2026, 6:13 PM

విమర్శించే వారిని పట్టించుకోవడం మానేశా.. ‘రాకాస’ ఈవెంట్‌లో నిహారిక బోల్డ్ కామెంట్స్!

త‌నను విమ‌ర్శించే వారిని ప‌ట్టించుకోవ‌డం ఎప్పుడో మానేశాన‌ని న‌టి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. త‌న సొంత బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న…

Tuesday, 31 March 2026, 3:05 PM

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM