lifestyle

High Fiber Diet : ఈ డైట్‌ను ఎప్పుడైనా ట్రై చేశారా.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

High Fiber Diet : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది ఊబ‌కాయం, అధిక బ‌రువు వంటి స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధాన‌మే ఈ స‌మస్య‌కు ప్ర‌ధాన కార‌ణం. అయితే ఆరోగ్యంపై అవ‌గాహ‌న రావ‌డంతో చాలా మంది బ‌రువు త‌గ్గ‌డానికి అనేక ర‌కాల ప్ర‌యత్నాలు చేస్తున్నారు. అనేక ర‌కాల డైట్ ల‌ను పాటిస్తున్నారు. అయితే ఇలా అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు లో కార్బోహైడ్రేట్స్, హై ఫైబ‌ర్ డైట్ ను పాటించ‌డం వ‌ల్ల సుల‌భంగా, ఆరోగ్య‌వంతంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ డైట్ ను పాటించ‌డం వ‌ల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండ‌వు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ డైట్ ను పాటించ‌డం వ‌ల్ల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు తీసుకోవాల్సిన త‌క్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫైబ‌ర్ ఉండే ఆహారాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.

త‌క్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫైబ‌ర్ ఉండే ఆహారాల్లో కూర‌గాయ‌లు ఒక‌టి. వీటిలో కార్బోహైడ్రేట్స్ చాలా త‌క్కువ‌గా ఉంటాయి. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ప్రేగుల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌డానికి, శ‌రీరంలో కొవ్వును క‌రిగించ‌డానికి, బ‌రువు త‌గ్గ‌డానికి, కొవ్వు రక్తంలోకి చేర‌కుండా కాపాడ‌డానికి కూర‌గాయ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. 100గ్రాముల కూర‌గాయ‌ల‌ల్లో కేవ‌లం 3 నుండి 4 గ్రాముల పిండి ప‌దార్థాలు మాత్ర‌మే ఉంటాయి. వీటి నుండి ల‌భించే శ‌క్తి చాలా త‌క్కువ క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు వీటిని ఉడికించి తీసుకోవ‌డం వల్ల సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అలాగే ఆకుకూర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఆకుకూర‌ల‌ల్లో కూడా పిండి ప‌దార్థాలు చాలా త‌క్కువ మోతాదులో ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌క్తి చాలా త‌క్కువ‌గా ల‌భిస్తుంది. వీటిలో ఉండే పీచు ప‌దార్థాలు కొవ్వును క‌రిగించ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి.

High Fiber Diet

రోజూ ఒక ఆకుకూర‌ను వండుకుని త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. అయితే వీటిని వండుకునేట‌ప్పుడు నూనె, ఉప్పు లేకుండా వండుకుని తిన‌డానికి ప్ర‌య‌త్నించాలి. నూనెను తీసుకోవ‌డం వ‌ల్ల 900 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే ఉప్పును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి నీరు ప‌డుతుంది. క‌నుక ఇవి రెండు లేకుండా కూర‌గాయ‌ల‌ను, ఆకుకూర‌ల‌ను వండుకుని తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. రోజూ 200 నుండి 250గ్రాము ఆకుకూర‌ను, అలాగే 300 నుండి 400 గ్రాముల కూర‌గాయ‌ల‌ను ఉడికించి తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అలాగే కూర‌గాయ‌ల‌ను కూడా వీలైనంత వ‌ర‌కు తొక్క‌తో తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. లేత కూర‌గాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల తొక్క తీసే అవ‌స‌రం ఉండ‌దు. దీంతో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఇలా కూర‌గాయ‌ల‌ను, ఆకుకూర‌ల‌ను చ‌ప్ప‌గా వండుకుని మ‌ధ్యాహ్నం పూట ఒక‌టి లేదా రెండు పుల్కాల‌తో తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు ప‌ట్ట‌కుండా ఉంటుంది. మ‌నం సుల‌భంగా, ఆరోగ్యవంతంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రాముడు ఎప్పటికీ ఆదర్శమే.. లాస్ ఏంజెల్స్‌లో రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ సందడి!

శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడ‌ని న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…

Tuesday, 31 March 2026, 10:49 PM

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని…

Tuesday, 31 March 2026, 8:28 PM

థియేటర్లలో మిస్ అయ్యారా? ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘హే భగవాన్’.. ఎక్కడ చూడాలంటే?

థియేట‌ర్ల‌లో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు.…

Tuesday, 31 March 2026, 6:13 PM

విమర్శించే వారిని పట్టించుకోవడం మానేశా.. ‘రాకాస’ ఈవెంట్‌లో నిహారిక బోల్డ్ కామెంట్స్!

త‌నను విమ‌ర్శించే వారిని ప‌ట్టించుకోవ‌డం ఎప్పుడో మానేశాన‌ని న‌టి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. త‌న సొంత బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న…

Tuesday, 31 March 2026, 3:05 PM

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM