lifestyle

Foods For Heart Health : ర‌క్తాన్ని ఇది ప‌లుచ‌గా చేస్తుంది.. దీంతో గుండె జ‌బ్బులు రావు..!

Foods For Heart Health : నేటి త‌రుణంలో చిన్న వ‌య‌సులోనే గుండె స‌మస్య‌లు త‌లెత్తుతున్నాయి. బీపీ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. దీంతో ర‌క్తం చిక్క‌గా త‌యార‌వుతుంది. చిక్క‌గా త‌యారైన రక్తాన్ని గుండె స‌రిగ్గా స‌ర‌ఫ‌రా చేయ‌లేదు. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణలో ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి. ఫ‌లితంగా కొన్ని సార్లు మ‌నం ప్రాణాల‌ను కూడా కోల్పోవాల్సి వ‌స్తుంది. ర‌క్తం ప‌లుచ‌గా ఉంటేనే ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ సాఫీగా సాగుతుంది. ఆరోగ్యానికి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ర‌క్తాన్ని ప‌లుచ‌గా చేయ‌డం కోసం చాలా మంది బ్ల‌డ్ తిన్న‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు. ముఖ్యంగా గుండె జ‌బ్బులు ఉన్న వారు, బైపాస్ ఆప‌రేష‌న్ అయిన వారు, హైబీపీ ఉన్న వారు, ర‌క్తం గడ్డ‌క‌ట్టే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్న వారికి వైద్యులు వీటిని ప్ర‌తిరోజూ వాడ‌మ‌ని చెబుతూ ఉంటారు.

అలాగే స‌మ‌స్య ఉన్నా లేకున్నా కూడా కొంద‌రు వీటిని ప్ర‌తిరోజూ వాడుతూ ఉంటారు. అయితే వీటిని ఒక్క‌సారి వాడ‌డం ప్రారంభిస్తే జీవిత కాలం వాడాల్సిందేన‌ని నిపుణులు చెబుతున్నారు. ఒక్క‌సారి ఈ బ్ల‌డ్ తిన్న‌ర్ ల‌ను వాడి మ‌ర‌లా వీటిని వాడ‌డం మానేస్తే ప్ర‌మాదాన్ని మ‌నం కొని తెచ్చుకున్న‌ట్టేనని నిపుణులు చెబుతున్నారు. అయితే మ‌న జీవ‌న విధానంలో మార్పు చేసుకోవ‌డం వ‌ల్ల బ్ల‌డ్ తిన్న‌ర్ ల‌ను జీవిత‌కాలం వాడే అవ‌స‌రం లేద‌ని నిపుణులు చెబుతున్నారు. నీటిని త‌క్కువ‌గా తాగ‌డం, ఉప్పును ఎక్కువ‌గా తీసుకోవ‌డం, నూనెలో వేయించిన ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వంటి వాటి వ‌ల్ల రక్తం చిక్క‌గా త‌యార‌వుతుంది. ఉప్పును ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం గ‌డ్డ‌కట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ర‌క్తాన్ని చిక్క‌గా చేసే గుణం ఉప్పుకు ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఆహారాల్లో ఉప్పును, నూనెను తీసుకోవ‌డం త‌గ్గిస్తే మ‌నం ర‌క్తాన్ని ప‌లుచ‌గా చేసే మందుల‌ను వాడే అవ‌స‌ర‌మే ఉండ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు.

Foods For Heart Health

ఉడికించిన ఆహారాల‌కు బ‌దులుగా స‌హ‌జ సిద్ద ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ఉప్పును, నూనెను వాడే అవ‌స‌ర‌మే ఉండ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. ఉద‌యం వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి. దీనిని తీసుకున్న ముప్పావు గంట త‌రువాత మొల‌కెత్తిన విత్తనాల‌ను తీసుకోవాలి. మ‌ధ్యాహ్నం ఉప్పు, నూనె లేకుండా కూర‌లు వండుకుని తీసుకోవాలి. సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో ఫ్రూట్ జ్యూస్ ను తీసుకోవాలి. అలాగే 7 గంట‌ల లోపు పండ్ల‌ను ఆహారంగా తీసుకోవాలి. సాయంత్రం భోజ‌నంలో బాదం ప‌ప్పు, వాల్ న‌ట్స్, చియా విత్త‌నాలు వంటి గుండెకు మేలు చేసే గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఉప్పు, నూనె వాడే అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఈ విధంగా ఉద‌యం, సాయంత్రం స‌హ‌జ ఆహారాల‌ను తీసుకోవడం వ‌ల్ల రెండు నెల‌ల్లోనే మ‌నం మందులు మానేయోచ్చ‌ని నిపుణులు చెబుత‌న్నారు. ఇటువంటి ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల బ్ల‌డ్ తిన్న‌ర్ ల‌ను వాడే అవ‌స‌ర‌మే ఉండ‌ద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

అమరావతికి నేను వ్యతిరేకం కాదు.. అది దేశంలోనే పెద్ద స్కామ్! చంద్రబాబుపై జగన్ ఫైర్..

అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండ‌డంలో త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని, కానీ రాజ‌ధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్ప‌డుతోంద‌ని, దానికి తాము…

Wednesday, 1 April 2026, 9:09 PM

సల్మాన్ ఖాన్ భద్రతలో లోపం? అభిమానుల మధ్య చిక్కుకున్న ‘భాయ్’.. వీడియో వైరల్!

ప‌బ్లిక్‌లో ఉన్న‌ప్పుడు సెల‌బ్రిటీల‌తో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గంద‌ర‌గోళ…

Wednesday, 1 April 2026, 5:13 PM

‘భూత్ బంగ్లా’ కోసం అక్షయ్ కుమార్ పూజలు.. అత్త డింపుల్‌తో కలిసి మహాకాళ్ దర్శనం!

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియ‌ద‌ర్శ‌న్ దర్శకత్వంలో తెరకెక్కిన…

Wednesday, 1 April 2026, 3:36 PM

రాముడు ఎప్పటికీ ఆదర్శమే.. లాస్ ఏంజెల్స్‌లో రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ సందడి!

శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడ‌ని న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…

Tuesday, 31 March 2026, 10:49 PM

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని…

Tuesday, 31 March 2026, 8:28 PM

థియేటర్లలో మిస్ అయ్యారా? ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘హే భగవాన్’.. ఎక్కడ చూడాలంటే?

థియేట‌ర్ల‌లో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు.…

Tuesday, 31 March 2026, 6:13 PM

విమర్శించే వారిని పట్టించుకోవడం మానేశా.. ‘రాకాస’ ఈవెంట్‌లో నిహారిక బోల్డ్ కామెంట్స్!

త‌నను విమ‌ర్శించే వారిని ప‌ట్టించుకోవ‌డం ఎప్పుడో మానేశాన‌ని న‌టి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. త‌న సొంత బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న…

Tuesday, 31 March 2026, 3:05 PM

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM