lifestyle

Vitamin B Complex Tablets : విట‌మిన్ బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ల గురించి త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Vitamin B Complex Tablets : మ‌న శ‌రీరం స‌క్ర‌మంగా పని చేయాలంటే అనేక రకాల పోష‌కాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. పోష‌కాలు స‌రిగ్గా అందితేనే మ‌న శ‌రీరం తన విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌గ‌ల‌దు. మ‌న శ‌రీరం త‌న విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌డానికి గానూ అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో బి కాంప్లెక్స్ విట‌మిన్స్ కూడా ఒక‌టి. బి కాంప్లెక్స్ విట‌మిన్స్ లో చాలా ర‌కాలు ఉంటాయి. ఇవి శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తాయి. శ‌రీరంలో ఈ విట‌మిన్స్ లోపించ‌డం వ‌ల్ల అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అలాగే చాలా మంది బి కాంప్లెక్స్ విట‌మిన్స్ కి సంబంధించిన క్యాప్సుల్స్ ను కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని అతిగా తీసుకున్నా కూడా అనేక దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

క‌నుక ఈ రోజూ మ‌నం బి కాంప్లెక్స్ విట‌మిన్స్ లో ఉండే ర‌కాల గురించి అలాగే ఈ క్యాప్సుల్స్ ను ఎంత మోతాదులో వాడాలి… వీటిని ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే దుష్ప్ర‌భావాల గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం. బి కాంప్లెక్స్ విట‌మిన్స్ లో విట‌మిన్ బి1,బి2 బి3, బి5, బి6, బి7, బి9, బి 12 వంటి ర‌కాలు ఉంటాయి. బి విట‌మిన్ లోపం ఎక్కువ‌గా వ‌య‌సు మీద ప‌డిన వారిలో క‌నిపిస్తుంది. వ‌య‌సు పెరిగే కొద్ది శ‌రీరం విట‌మిన్స్ ను గ్ర‌హించే శ‌క్తిని కోల్పోతుంది. అందువ‌ల్ల వ‌య‌సు ప‌డిన వారిలో బి విట‌మిన్స్ లోపం ఎక్కువ‌గా వ‌స్తుంది. అలాగే గ‌ర్భిణీ స్త్రీల‌ల్లో, ఆల్క‌హాల్ ను ఎక్కువ‌గా తీసుకునే వారిలో, షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారిలో, పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డే వారిలో బి విట‌మిన్స్ లోపం ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఈ విట‌మిన్స్ లోపించ‌డం వ‌ల్ల ఆక‌లి లేక‌పోవ‌డం, జీర్ణ స‌మ‌స్య‌లు, చ‌ర్మం పొడిబార‌డం, జుట్టు ఊడ‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం, నోటిలో పుండ్లు, ర‌క్త‌హీన‌త‌, అల‌స‌ట‌, నీర‌సం వంటి ల‌క్ష‌ణాలు మ‌న‌లో క‌నిపిస్తాయి.

Vitamin B Complex Tablets

ఇక ఈ క్యాప్సుల్స్ రోజుకు ఒక‌టి చొప్పున మాత్ర‌మే తీసుకోవాలి. ఉద‌యం లేదా సాయంత్రం ఆహారం తీసుకున్న త‌రువాత ఈ క్యాప్సుల్ ను వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ క‌ర్యాప్సుల్స్ ను ఎక్కువ కాలం పాటు అస్స‌లు వాడ‌కూడ‌దు. ఒక‌టి లేదా రెండు నెల‌లు వాడి ఆ త‌రువాత మానేయాలి. అలాగే బి కాంప్లెక్స్ విట‌మిన్స్ ను వాడ‌డం వ‌ల్ల దుష్ప్ర‌భావాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. ఏదో ఒక సంద‌ర్భంలోనే వీటి వ‌ల్ల మ‌నం దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. బి కాంప్లెక్స్ విట‌మిన్స్ నీటిలో క‌రిగిపోతాయి. ఇవి శ‌రీరంలో ఎక్కువ‌గా ఉంటే మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పోతాయి. ఈ విట‌మిన్స్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మూత్రం ప‌సుపు రంగులో రావ‌డం, త‌ల తిరిగిన‌ట్టుగా ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. క‌నుక వైద్యుల సూచ‌న మేర‌కు త‌గిన మోతాదులో వీటిని వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సల్మాన్ ఖాన్ భద్రతలో లోపం? అభిమానుల మధ్య చిక్కుకున్న ‘భాయ్’.. వీడియో వైరల్!

ప‌బ్లిక్‌లో ఉన్న‌ప్పుడు సెల‌బ్రిటీల‌తో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గంద‌ర‌గోళ…

Wednesday, 1 April 2026, 5:13 PM

‘భూత్ బంగ్లా’ కోసం అక్షయ్ కుమార్ పూజలు.. అత్త డింపుల్‌తో కలిసి మహాకాళ్ దర్శనం!

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియ‌ద‌ర్శ‌న్ దర్శకత్వంలో తెరకెక్కిన…

Wednesday, 1 April 2026, 3:36 PM

రాముడు ఎప్పటికీ ఆదర్శమే.. లాస్ ఏంజెల్స్‌లో రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ సందడి!

శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడ‌ని న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…

Tuesday, 31 March 2026, 10:49 PM

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని…

Tuesday, 31 March 2026, 8:28 PM

థియేటర్లలో మిస్ అయ్యారా? ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘హే భగవాన్’.. ఎక్కడ చూడాలంటే?

థియేట‌ర్ల‌లో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు.…

Tuesday, 31 March 2026, 6:13 PM

విమర్శించే వారిని పట్టించుకోవడం మానేశా.. ‘రాకాస’ ఈవెంట్‌లో నిహారిక బోల్డ్ కామెంట్స్!

త‌నను విమ‌ర్శించే వారిని ప‌ట్టించుకోవ‌డం ఎప్పుడో మానేశాన‌ని న‌టి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. త‌న సొంత బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న…

Tuesday, 31 March 2026, 3:05 PM

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM