Phobias : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మనుషుల్లో కొందరికి కొన్ని రకాల భయాలు ఉంటాయి. మరికొందరికి మరికొన్ని రకాల భయాలుంటాయి. కొందరికి దెయ్యాలు అంటే భయం ఉంటే.. కొందరికి ఎత్తైన ప్రదేశాలు అంటే భయం పుడుతుంది. అలాగే ఇంకొందరు సముద్రంలో ఉన్న నీరును చూడాలంటే భయపడతారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మనుషులు చాలా మందికి అనేక రకాల ఫోబియాలు ఉంటాయి. అయితే కొన్ని రకాల ఫోబియాలు మాత్రం కొందరికి సహజంగానే ఉంటాయి. అవి కామన్.. కానీ కింద తెలిపిన ఫోబియాలు కూడా కొంతమందికి ఉంటాయి. నిజానికి అవి చాలా వింతైన ఫోబియాలు.. మరి ఆ ఫోబియాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
హీలియో ఫోబియా. ఈ ఫోబియా ఉన్నవారికి సూర్యుడు అన్నా లేదా కాంతివంతంగా కనిపించే వస్తువులు అన్నా, కాంతి అన్నా భయం ఉంటుంది. నిజంగా వింతగా ఉంది కదా. అయినా ఈ ఫోబియా ఉండేవారు కూడా ప్రపంచంలో ఏదో ఒక మూలన ఉంటారట. లకానోఫోబియా. ఈ ఫోబియా ఉన్నవారికి కూరగాయలు అంటే భయం ఉంటుంది. దీంతో వారు కూరగాయలను తినేందుకు ఇష్టపడరు. భయపడతారు. హఫే ఫోబియా. ఈ భయం ఉన్నవారు ఇతరులను టచ్ చేయడానికి కూడా భయపడుతారట. ఎందుకంటే.. ఇతరులను టచ్ చేస్తే వారి చేతులకు ఉన్న విష పదార్థాలు తమకు అంటుతాయోమోనని, లేదా ఏవైనా అంటు వ్యాధులు వస్తాయేమోనని భయపడతారు. అందుకే ఈ ఫోబియా ఉన్నవారు సాధారణంగా ఇతరులను టచ్ చేయడానికి ఆసక్తి చూపించరు.
కౌల్రో ఫోబియా. ఈ ఫోబియా ఉన్నవారికి జోకర్లు అంటే భయం ఉంటుంది. ఎంతలా అంటే.. జోకర్ క్యారెక్టర్లు కనిపించినా.. వారు భయపడిపోతారు. నియో ఫోబియా. ఈ భయం ఉన్నవారు కొత్త వస్తువులు, కొత్త మనుషులు, కొత్త విషయాలు.. ఏవైనా సరే.. కొత్త అంటే.. భయపడతారు. నిజంగా ఈ ఫోబియా భలే విచిత్రంగా ఉంది కదా. ట్యురో ఫోబియా. ఈ ఫోబియా ఉన్నవారు చీజ్ అంటే భయపడతారు. చీజ్ తినేందుకు ఆసక్తి చూపరు. ఆందోళన చెందుతారు. జెఫిరోఫోబియా. ఈ ఫోబియా ఉన్నవారికి ఎత్తైన బ్రిడ్జిలు అంటే భయం ఉంటుంది. వాటిని ఎక్కేందుకు భయ పడతారు. అసెండోఫోబియా. ఈ భయం ఉన్నవారు ఎస్కలేటర్ మెట్లు, లిఫ్ట్ లేదా సాధారణ మెట్లపై ఎక్కడానికి జంకుతారు. ఆ విధంగా చేయడం వారికి నచ్చదు. ఆందోళన చెందుతారు.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…