స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 150 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు https://sbi.co.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా 150 పోస్టులను భర్తీ చేస్తారు. ఎస్సీలకు 24, ఎస్‌టీలకు 11, ఓబీసీలకు 38, ఈడబ్ల్యూఎస్ 15, యూఆర్ 62 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు గాను దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా జనవరి 23వ తేదీ వరకు గడువు విధించారు.
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఐఐబీఎఫ్ ద్వారా ఫారెక్స్‌లో సర్టిఫికెట్ పొందాలి. సర్టిఫికెట్ తేదీ 31.12.2024 నాటికి లేటెస్ట్ అయి ఉండాలి. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్ చూసి తెలుసుకోవచ్చు.
అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ.750 చెల్లించాలి. రిజర్వ్‌డ్ కేటగిరిలకు చెందిన వారికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…