రైల్వేలో జాబ్ పొందాలని చూస్తున్నారా..? అయితే ఈ నోటిఫికేషన్ మీ కోసమే. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 1036 పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వే శాఖలలో పనిచేసేందుకు గాను ఇంటర్, డిగ్రీ లేదా పీజీ చదివిన ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు గాను ఫిబ్రవరి 16ను చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు https://www.rrbapply.gov.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, స్టాఫ్ అండ్ వెల్పేర్ ఇన్‌స్పెక్టర్, చీఫ్ లా అసిస్టెంట్, కుక్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ఫిజికల్ ట్రెయినింగ్ ఇన్‌స్ట్రక్టర్, అసిస్టెంట మిస్ట్రెస్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, హెడ్ కుక్, ఫింగర్ ప్రింట్ ఎగ్జామినర్ పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భర్తీ చేస్తారు. పోస్టును బట్టి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలంటే పైన ఇచ్చిన లింక్‌ను సందర్శించవచ్చు. ఇక అభ్యర్థుల వయస్సు 18 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజును రూ.500గా నిర్ణయించారు. రిజర్వ్‌డ్ కేటగిరిలకు చెందిన అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ మార్కును కట్ చేస్తారు. ఆసక్తి ఉన్న వారు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…