సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

January 15, 2026 9:13 PM

దేశంలోని ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒక‌టైన సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల‌ను ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా భ‌ర్తీ చేస్తారు. బ్యాంకింగ్ రంగంలో మంచి కెరీర్ కోసం చూస్తున్న వారికి ఇదొక గొప్ప అవ‌కాశంగా చెప్ప‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఈ బ్యాంకుకు చెందిన ప‌లు బ్రాంచిల్లో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు అర్హులు. సీఏ, ఎంబీఏ చేసిన వారు కూడా అప్లై చేయ‌వ‌చ్చు. అభ్య‌ర్థుల వ‌య‌స్సు క‌నీసం 20 సంవ‌త్స‌రాలు ఉండాలి. గ‌రిష్టంగా 30 ఏళ్ల వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిల‌కు చెందిన అభ్య‌ర్థుల‌కు గ‌రిష్ట వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి. బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ రంగంలో ప‌ని అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త ఇవ్వ‌బ‌డుతుంది.

central bank of india credit officer jobs recruitment 2025 full details

అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు లేదా మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకునేందుకు https://www.centralbankofindia.co.in/en/recruitments అనే అధికారిక సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. ఇందులో కెరీర్స్ లేదా రిక్రూట్‌మెంట్ అనే సెక్ష‌న్‌లోకి వెళ్లాలి. అక్క‌డ ఉండే క్రెడిట్ ఆఫీస‌ర్ అనే జాబ్ నోటిఫికేష‌న్‌ను ఎంచుకోవాలి. దీంతో ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు వ‌స్తాయి. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న వారు అక్క‌డే ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు గాను ఫిబ్ర‌వ‌రి 20ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now