AP Govt Jobs : టెన్త్ అర్హతతో జాబ్.. రాత పరీక్ష కూడా లేదు.. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే చాలు..!

September 19, 2023 8:34 AM

AP Govt Jobs : ఏదైనా మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే ఈ నోటిఫికేషన్ గురించి మీరు క‌చ్చితంగా చూడాలి. పదవ తరగతి పూర్తి చేసిన వాళ్ళకి గుడ్ న్యూస్. పది అర్హతతోనే మంచి ఉద్యోగాన్ని పొందవచ్చు. తెలుగు వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్ ని విడుదల చేశారు. ఒక్క రోజు ఇంటర్వ్యూ కి వెళ్తే చాలు. సెలెక్ట్ అయితే పక్కా మీకు ఇక జాబ్ వచ్చేస్తుంది. మరి నిరుద్యోగులూ.. ఈ జాబ్ ని పొందండి.

జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ డిఆర్ఏసి (డ్యాప్) జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా పోస్టుల‌కు రిక్రూట్మెంట్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా జారీ చేస్తోంది. ఇండియాలో ఉన్న ఎవరైనా సరే హాజరు కావచ్చు. ఇక పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పోస్టును బట్టి జీతం 15 వేల రూపాయల నుండి 35వేల రూపాయల వరకు ఉంటుంది.

AP Govt Jobs how to apple salary and full details
AP Govt Jobs

వయసు విషయానికి వస్తే.. వయసు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 18 సంవత్సరాల నిండి ఉన్నవాళ్లు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. నైపుణ్య అభివృద్ధి సంస్థ డిఆర్ఏసి డ్యాప్ జిల్లా ఉపాధి కార్యాలయం APSSDC ద్వారా 180 పోస్టుల‌తో కూడిన నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు. టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, డీఫామ్, బీఫామ్, ఎంఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించక్కర్లేదు.

సెప్టెంబర్ 23న ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. కేవలం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే చాలు జాబ్ ఇచ్చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా విద్యార్హతలు, మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా జాబ్ ని పొందవచ్చు. పూర్తి వివరాలని తెలుసుకోవడం కోసం కింద లింక్ ని క్లిక్ చేసి వివరాలను తెలుసుకుని ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. అలాగే కావాల్సిన డాక్యుమెంట్ల వివరాలు మొదలు అన్ని వివరాలు కూడా ఈ లింక్ లో మీరు చూడొచ్చు.

https://www.apssdc.in/home/

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment