Pradhuman Singh Tomar : వాహ్‌.. మంత్రి అంటే మీరే సారు.. టాయిలెట్ల‌ను స్వ‌యంగా శుభ్రం చేశారు..!

December 18, 2021 7:48 PM

Pradhuman Singh Tomar Cleaned Toilets in Government School : ప్ర‌జలు వేసిన ఓట్ల‌తో ప్ర‌జా ప్ర‌తినిధులుగా గెలిచే నేత‌లు తిరిగి ప్ర‌జ‌ల ముఖం చూడ‌రు. వారి స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోరు. చాలా మంది ప్ర‌జా ప్ర‌తినిధుల వ్య‌వ‌హారం ఇలాగే ఉంటుంది. కానీ కొంద‌రు మాత్రం నిజ‌మైన నాయ‌కుల‌మ‌ని నిరూపిస్తున్నారు. తాము ఎంత‌టి ఉన్న‌త స్థానంలో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు మాత్రం వెనుకాడ‌డం లేదు. ఆ మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతార‌ని చెప్ప‌వ‌చ్చు.

Pradhuman Singh Tomar cleaned toilets in government school

మ‌ధ్య‌ప్ర‌దేశ్ విద్యుత్ శాఖ మంత్రి ప్ర‌ధుమ‌న్ సింగ్ తోమ‌ర్ తాజాగా అక్క‌డి గ్వాలియ‌ర్‌లో ఉన్న ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను సంద‌ర్శించారు. అక్క‌డ కొంద‌రు బాలిక‌లు పాఠ‌శాల‌లో టాయిలెట్లు శుభ్రంగా లేవ‌ని ఆయ‌న‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన తోమ‌ర్ స్వ‌యంగా రంగంలోకి దిగి ఆ పాఠ‌శాల‌లో ఉన్న టాయిలెట్ల‌ను శుభ్రం చేశారు.

అయితే ఆయ‌న ఇలా చేయ‌డం కొత్తేమీ కాదు. గ‌తంలో ఓ ప్ర‌భుత్వ కార్యాల‌యంలో మ‌హిళా ఉద్యోగుల ఫిర్యాదు మేర‌కు ఆయ‌న ఇలాగే టాయిలెట్ల‌ను శుభ్రప‌రిచారు. ఈ క్ర‌మంలోనే తోమ‌ర్ ను నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. నిజ‌మైన ప్ర‌జా ప్ర‌తినిధి అంటే ఇలాగే ఉండాల‌ని అభినందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now