Ceiling Fan Speed : వేస‌విలో మీ ఫ్యాన్ ఎక్కువ వేగంగా తిర‌గ‌డం లేదా.. అయితే ఇలా చేయండి..!

April 29, 2024 8:37 PM

Ceiling Fan Speed : వేస‌వి ఉష్ణోగ్ర‌త‌లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్ర‌జ‌లు మ‌ధ్యాహ్న స‌మ‌యంలో బ‌య‌టికి రావ‌డ‌మే మానేసారు. ఇంట్లోనే ఉండి ఫ్యాన్లు, కూల‌ర్ లు, ఏసీ ల కింద ఎండ నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొందుతున్నారు. అయితే ఇప్ప‌టికి చాలా మంది వేస‌వికాలంలో ఫ్యాన్ ల‌నే ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. కూల‌ర్లు, ఏసీలు వాడే స్తోమ‌త‌ లేని వారు ఫ్యాన్ ల‌నే ఎంచుకుంటారు. కూల‌ర్లు, ఏసీలు ఉన్న‌ప్ప‌టికి క‌రెంట్ బిల్ ఎక్కువ‌గా వ‌స్తుంది అన్న ఉద్దేశ్యంతో కొంద‌రు ఫ్యాన్ ల‌నే ఎక్కువ‌గా వాడుతూ ఉంటారు. అలాగే బ‌య‌టికి వెళ్లి ఇంటికి రాగానే ముందుగా మ‌నం ఫ్యాన్ స్విచ్ నే ఆన్ చేస్తూ ఉంటాము. అయితే వేసవికాలంలో ఫ్యాన్ కింద కూర్చున్న‌ప్ప‌టికి మ‌న‌కు చెమ‌ట కార‌డం త‌గ్గ‌దు.

ఉక్క‌పోత త‌గ్గదు. దీంతో చాలా మంది ఫ్యాన్ స్పీడ్ త‌క్కువ‌గా వ‌స్తుంది అని అంటుంటారు. కొంద‌రైతే ఫ్యాన్ ను రిపేర్ చేస్తూ ఉంటారు కూడా. కొంద‌రు పాత ఫ్యాన్ ను తీసేసి ఆ స్థానంలో కొత్త ఫ్యాన్ ను పెడుతూ ఉంటారు. దీని వ‌ల్ల ఖ‌ర్చు ఎక్కువ‌గా పెరుగుతుంది. అయితే ఇలా ఫ్యాన్ ను రిపేర్ చేసే ప‌ని లేకుండా, కొత్త ఫ్యాన్ ను తెచ్చే ప‌ని లేకుండా ఉండాలంటే అసలు వేస‌వికాలంలో ఫ్యాన్ ఎందుకు త‌క్కువ స్పీడ్ తో తిరుగుతుందో ముందుగా తెలుసుకోవాలి. వేస‌వికాలంలో త‌క్కువ ఓల్టేజ్ ఉంటుంది. వేస‌వికాలంలో విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. దీని కార‌ణంగా ఫ్యాన్ స్పీడ్ త‌గ్గుతుంది.

Ceiling Fan Speed follow these tips for it
Ceiling Fan Speed

అలాగే బ‌ల‌హీన‌మైన కండెన్స‌ర్ ఉండడం వ‌ల్ల కూడా ఫ్యాన్ త‌క్కువ స్పీడ్ తో తిరుగుతుంది. ఓల్టెజ్ స‌రిగ్గా ఉన్న‌ప్ప‌టికి ఫ్యాన్ త‌క్కువ స్పీడ్ తో తిరిగితే అది కండెన్స‌ర్ స‌మ‌స్యే అని గుర్తించాలి. ఓల్టెజ్ స‌మ‌స్య‌ను మ‌నం ఎలాగు స‌రిచేయ‌లేము. ఒక‌వేళ కండెన్స‌ర్ స‌మ‌స్య అయితే దీనిని మ‌నం సుల‌భంగా స‌రిచేయ‌గ‌ల‌ము. మెకానిక్ తో ప‌ని లేకుండా కండెన్స‌ర్ ను మీరే మార్చ‌వ‌చ్చు. మీ ఫ్యాన్ కు స‌రిపోయే కొత్త కండెన్స‌ర్ ను కొనుగోలు చేసి ఇంటి మెయిన్ ను ఆఫ్ చేసి కండెన్స‌ర్ ను మార్చుకుంటే స‌రిపోతుంది. కండెన్స‌ర్ మార్చ‌డం వ‌ల్ల మీ ఫ్యాన్ వేగం పెరుగుతుంది. ఫ్యాన్ పాత‌ది అయిన‌ప్ప‌టికి కొత్త‌దానిలా ఎక్కువ వేగంతో తిరుగుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now