Immunity : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. అయితే రోగ నిరోధక శక్తి బాగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు రావు. ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చూస్తున్నారు. మంచి ఆహారాన్ని డైట్‌లో తీసుకుంటున్నారు. రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చు అనేది ఆరోగ్య నిపుణులు చెప్పారు. మరి రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ గింజలను తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
మరి వేటిని తీసుకోవాలి, వేటి ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అనేది తెలుసుకుందాం. బాదం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బాదంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బాదంని తీసుకోవడం వలన చక్కటి లాభాలు ఉంటాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని బాదం పెంపొందిస్తుంది. ప్రతిరోజు 5 నుండి 6 బాదం పప్పులను నీళ్లలో నానబెట్టుకుని ఉదయాన్నే తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. శరీరంలో వాపులు తగ్గుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉండవు.
వాల్ నట్స్ ని తీసుకుంటే కూడా ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. వీటిని తీసుకోవడం వలన గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదం కూడా ఉండదు. వాల్ నట్స్ తో మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. స్పెర్మ్ ఆరోగ్యానికి కూడా ఇది సహాయపడుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పుతో కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. జీడిపప్పును తీసుకుంటే కాపర్, ఐరన్ అందుతాయి.
శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని జీడిపప్పు పెంచుతుంది. ఇమ్యూనిటీని కూడా ఇది పెంచుతుంది. పిస్తా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పిస్తా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ బి6 మొదలు అనేక పోషకాలు వీటిలో ఉంటాయి. ఎండు ద్రాక్షతో కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలని కలిగి ఉంటుంది. అలాగే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా వీటిలో ఉంటాయి. ఐరన్ ఎక్కువగా వీటిలో ఉంటుంది. రుతుక్రమం సమయంలో మహిళలకు ఇది చాలా మేలు చేస్తుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…