Dry Grapes : ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారా…? అయితే కచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోండి. మన ఆరోగ్యం బాగుండాలంటే మనం తీసుకున్న ఆహారం కూడా బాగుండాలి. రాత్రిపూట కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే మనకి ఎంతో మేలు కలుగుతుంది. రాత్రి పూట ఎండు ద్రాక్షని తీసుకుంటే పలు లాభాలని పొందొచ్చు. మరి రాత్రిళ్ళు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఎటువంటి లాభాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
ఎసిడిటీతో బాధపడే వాళ్ళు, నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు రోజూ రాత్రి పూట ఎండుద్రాక్షను తీసుకోవడం మంచిది. శరీరంలో మెలటోనిన్, ట్రిప్టోఫాన్, ఫోలేట్ స్థాయిలు పెరుగుతాయి. మంచి నిద్రని కలిగిస్తాయి. రోజూ రాత్రి పూట ఎండుద్రాక్షని తీసుకుంటే నరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. నరాల సమస్యలు కూడా ఉండవు.
రాత్రిపూట ఐదు ఎండు ద్రాక్షలని నిద్రపోవడానికి ముందు తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. కంటి చూపుని ఎండుద్రాక్ష ద్వారా పెంపొందించుకోవచ్చు. రాత్రిపూట ఎండు ద్రాక్షని కావాలంటే పాలల్లో కలిపి కూడా తీసుకోవచ్చు. అలాగే ఇది ఒంట్లో సోడియంని గ్రహిస్తుంది. అదనపు సోడియంని తగ్గించేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణని పెంచుతుంది కూడా. ఎండుద్రాక్షను తీసుకోవడం వలన ఎముకల్ని కూడా అది నయం చేస్తుంది,
ఎముకలు ఎండుద్రాక్ష ద్వారా బలపడతాయి. ఎండు ద్రాక్ష తీసుకుంటే బరువు కూడా తగ్గొచ్చు. కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలని కూడా నియంత్రిస్తుంది. వీటిని తీసుకోవడం వలన ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు మనకి చక్కటి లాభాన్ని కలిగిస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా ఎండు ద్రాక్ష పెంచుతుంది. గుండె జబ్బులు, ఆల్జీమర్స్ వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఎండుద్రాక్ష మంచి నిద్రని కూడా అందిస్తుంది. ఇలా ఎండు ద్రాక్ష వలన అనేక లాభాలు ఉంటాయి.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…