ఆరోగ్యం

Stroke : ప్రాణాపాయ స్ట్రోక్స్‌.. వ‌చ్చే ముందు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయంటే..?

Stroke : ఈరోజుల‌లో చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా, ఆరోగ్యంగా ఉండాలంటే, కొన్ని తప్పులు చేయకూడదు. అయితే, ఈ రోజుల్లో స్ట్రోక్ వంటి సమస్యలు కూడా ఎక్కువైపోయాయి. చాలామంది స్ట్రోక్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే, స్ట్రోక్ వచ్చే ముందు ఏం జరుగుతుంది..?, ఎలాంటి లక్షణాలు ఉంటాయి..?, ఎలా స్ట్రోక్ ల‌ని మనం గుర్తించొచ్చు..?, నివారించడం ఎలా వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

ఇస్కిమిక్ స్ట్రోక్ యొక్క లక్షణాల‌ని చూస్తే.. దృష్టి సమస్యలు, చేతులు, కాళ్లు బలహీనంగా మారిపోవడం, సమన్వయాన్ని కోల్పోవడం, ఒకవైపు ముఖం వేలాడుతూ ఉన్నట్లు ఉండడం, గందరగోళం వంటివి దీనికి లక్షణాలు. స్ట్రోక్ యొక్క అత్యంత సాధారణ లక్షణం ఏంటంటే అవయవాల బలహీనత లేదంటే పక్షవాతం. అకస్మాత్తుగా ఇతర లక్షణాలు కూడా కనపడొచ్చు. స్ట్రోక్ రావడానికి కొన్ని గంటల ముందు లేదా కొన్ని రోజులు ముందు ఇటువంటి లక్షణాలు కనబడతాయి.

Stroke

కండరాల నొప్పి, కండరాల బిగుతు కారణంగా అవయవాల్ని కదిలించలేక పోతారు. శరీరంలో ఎక్కడైనా లేదంటే కీలులో ఇది ఉండొచ్చు. మెదడుకి రక్త సరఫరా తగ్గినప్పుడు, ఇతర అవయవాల మీద కూడా ప్రభావం పడుతుంది. కదలికలు సరిగా లేకపోవడం వంటివి కూడా జరుగుతాయి. కండరాల బిగుతు, తిమ్మిరి కూడా కలగొచ్చు.

స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే కొన్ని ఆరోగ్య పరిస్థితుల‌ వివరాల్లోకి వెళితే.. అధిక రక్తపోటు, కొవ్వు ఎక్కువగా ఉండడం, గుండెపోటు, రక్తహీనత, రక్తం గడ్డ కట్టడం, షుగర్ పేషెంట్లలో, ధూమపానం, ఆల్కహాల్ తీసుకోవడం వంటివి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. ఎవరికైనా మీ ఫ్యామిలీలో ఉన్నట్లయితే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సాధారణ పరీక్షలు చేయించుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శరీర బరువుని కంట్రోల్ లో ఉంచుకోవడం, గుండెకి మేలు చేసే ఆహారం తీసుకోవడం, మంచి నిద్రతో స్ట్రోక్ రాకుండా జాగ్రత్త పడొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM