Sesame Oil : నువ్వులు శరీరానికి అవసరమైన, ఆరోగ్యాన్ని పెంపొందించే అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి. కనుక వీటిని పవర్ హౌస్ అంటారు. నువ్వులనూనెతో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని ఆయుర్వేద వైద్యంలోనూ విరివిగా వాడుతారు. నువ్వులనూనె ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మాన్ని కాపాడడంలో నువ్వులనూనె ప్రాధాన్యత చాలానే ఉంది. నువ్వులనూనెలో విటమిన్ ఇ, బిలతోపాటు చర్మానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను దూరం చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని వాడడం వల్ల ముఖం ఫ్రెష్‌గా, యవ్వనంగా మెరుస్తూ ఉంటుంది.
చిన్నారుల అందం, ఆరోగ్యం విషయంలో నువ్వుల నూనె కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలోని విటమిన్స్, మినరల్స్ చిన్నారుల దేహాన్ని పుష్టిగా ఉంచుతాయి. దీంట్లో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. దీనిలోని యాంటీ యాక్సిడెంట్లు చిన్నారుల్లో కొవ్వు స్థాయిలని నియంత్రణలో ఉంచుతాయి. స్నానానికి ముందు పసిపిల్లల మాడుకు, శరీరానికి నువ్వుల నూనెతో మర్దనా చేస్తే హాయిగా నిద్రపోతారు. ఈ నూనె చిన్నారుల మెదడు ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. వెన్నెముక, కండరాలు బలపడేందుకు సహాయకారిగా ఉంటుంది. అయితే ఈ నూనెను పెద్దలు కూడా శరీరానికి మర్దనా చేసుకోవచ్చు. దీంతోనూ పైన చెప్పిన ప్రయోజనాలు కలుగుతాయి.
దీనిలో ఒమెగా-3 ఫాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి బీపీ స్థాయిని తగ్గిస్తాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రావు. నువ్వులలో కాపర్ వంటి మూలకాలు, యాంటీ ఆక్సిడెంట్ లు ఉండడం వల్ల శక్తివంతంగా కీళ్లనొప్పులను, వాపులను తగ్గిస్తాయి. అంతేకాకుండా వీటిలో ఉండే మూలకాలు, మినరల్స్ రక్తనాళాలు, కీళ్ళను దృఢంగా ఉండేలా చేస్తాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగపడే మెగ్నీషియం, పేగు క్యాన్సర్, మైగ్రేన్ లాంటి సమస్యలను అరికట్టే కాల్షియం, ఎముకలు గట్టిపడేందుకు సహాయపడే జింక్ తదితరాలన్నీ ఈ నువ్వుల నూనెలో ఉంటాయి. దీంతో ప్రకృతి ఇచ్చిన వరంగా చెప్పుకోవచ్చు.
నువ్వుల నూనెలో ఉండే మెగ్నీషియం వంటి పోషకాలు మధుమేహ వ్యాధిని తగ్గించడంలో సహాయపడతాయి. నువ్వుల నుంచి తీసిన నూనెలు శక్తివంతంగా శరీర రక్త పీడనాన్ని తగ్గించడమే కాకుండా మధుమేహ వ్యాధి గ్రస్తులలో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను, రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతాయి. దీంతో షుగర్ అదుపులో ఉంటుంది. ఇక జుట్టు మృదువుగా ఉండాలన్నా, చుండ్రు మాయం కావాలన్నా నువ్వుల నూనె బెస్ట్ అంటున్నారు సౌందర్య నిపుణులు. దీంతో జుట్టుకు కావలసిన పోషకాలు అందుతాయి. దీన్ని తలకు బాగా పట్టించి తలస్నానం చేస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది. ఇలా నువ్వుల నూనెతో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…