Orange Peel : నారింజ పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండ్లలో ఉండే ఫైబర్ మనకు ఎదురయ్యే జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. అలాగే అనేక ఇతర ప్రయోజనాలు కూడా మనకు నారింజ పండ్లను తినడం వల్ల కలుగుతాయి. అయితే కేవలం నారింజ పండ్లే కాదు, వాటి తొక్కలతోనూ మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటంటే..
నారింజ పండు తొక్కలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల నొప్పులు, గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. వాటిపై నారింజ పండు తొక్కను రుద్దుతూ ఉంటే చాలు.. ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. నారింజ పండ్ల తొక్కలను ఎండబెట్టి పొడి చేసి నిత్యం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. నారింజ పండ్ల తొక్కలను ఎండబెట్టి పొడి చేసి రోజూ తింటే మన శరీరానికి కావల్సిన ఫైబర్ అందుతుంది. దీంతో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక బరువు తగ్గుతారు.
మొటిమలతో బాధపడుతున్నవారు నారింజ పండు తొక్కను రోజూ మొటిమలపై రాస్తూ ఉంటే త్వరలోనే మొటిమలు తగ్గుతాయి. చర్మానికి కాంతిని అందివ్వడంలో, చర్మాన్ని మృదువుగా మార్చడంలో నారింజ పండు తొక్క అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం నారింజ పండు తొక్కలను చర్మానికి రుద్దుతూ ఉంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇలా నారింజ పండు తొక్కలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఇకపై వాటిని పడేయకండి. వాటితో పైన చెప్పిన విధంగా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…