Honey For Face : తేనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. తేనెతో చాలా సమస్యలు తొలగిపోతాయి. తేనెతో అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. చర్మాన్ని తేమగా మారుస్తుంది తేనె. తేనెని ముఖానికి పట్టిస్తే చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకుని తేనెని ముఖానికి పట్టించి పూర్తిగా అది పీల్చుకున్నాక చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. సుమారు అరగంట పాటు ఉంచుకుంటే చాలు.
చర్మం బాగుండాలంటే ముఖానికి తేనె రాసుకొని ఐస్ క్యూబ్ తో మసాజ్ చేసుకోండి. చర్మంపై గాయాలు తగ్గిపోతాయి. మృత కణాలు కూడా తొలగిపోతాయి. కొత్త చర్మ కణాల ఉత్పత్తికి తేనె సహాయం చేస్తుంది. తేనెతో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను కూడా తగ్గించుకోవచ్చు. మీ చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుకోవాలంటే తేనెని రాసుకుంటూ ఉండండి. తేనెలోని యాంటీ మైక్రోబియల్ గుణాలు స్కిన్ ఇరిటేషన్ ని బాగా తగ్గిస్తాయి.
మొటిమల కారణంగా వచ్చిన మచ్చల్ని కూడా తేనె పోగోడుతుంది. తేనెలో ఎమోలియంట్ గుణాలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే జుట్టుని ఆరోగ్యంగా ఉంచగలవు. జుట్టు కుదుళ్ళకి తేమని అందిస్తాయి. చిట్లిన జుట్టుని మృదువుగా మార్చేస్తుంది తేనె. అలాగే జుట్టు ఎదుగుదలకి సహాయం చేస్తుంది. వారానికి ఒకసారి అరకప్పు బియ్యంలో ఒక కప్పు నీళ్లు పోసుకు, రెండు గంటల పాటు నానబెట్టి ఆ నీళ్ళని వడకట్టేసి అందులో వేడి చేసిన తేనెను మిక్స్ చేయండి.
దీన్ని పట్టించేసి ఆ తరువాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే వెంట్రుకలు రాలిపోవడం వంటి బాధలు ఉండవు. కుదుళ్ళు గట్టిపడతాయి. ఇలా ఈ విధంగా మీరు ఉపయోగించినట్లయితే చక్కటి లాభాలని పొందొచ్చు. ముఖ సౌందర్యానికి, జుట్టు ఆరోగ్యానికి ఇలా తేనె ఎంతగానో సహాయం చేస్తుంది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…