Holding Urine : చాలా మంది పనిలో పడిపోయి కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అటువంటి తప్పుల వలన మీ ఆరోగ్యం కూడా పాడవుతుంది జాగ్రత్త. ఎక్కువ మంది మూత్రం వచ్చినా కూడా, వెళ్లకుండా ఆపేసుకుంటూ ఉంటారు. కానీ, అది నిజానికి చాలా పెద్ద తప్పు. అలా అస్సలు చేయకూడదు. సరైన టైం కి మూత్ర విసర్జన చేయక పోవడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. యూరిన్ కి వెళ్లకుండా ఆపేసుకోవడం అత్యంత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మూత్రాన్ని ఆపుకోవడం వలన ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనేది ఇప్పుడు చూసేద్దాం. మూత్రం వచ్చినట్లయితే, అసలు ఆపుకోకూడదు. మూత్ర విసర్జన చేయాల్సిన టైం వచ్చినప్పుడు, వెంటనే మూత్ర విసర్జన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మూత్రాన్ని ఆపుకోకూడదు. మూత్రాశయం నిండినప్పుడు, మూత్ర విసర్జన చేయకపోతే అనేక సమస్యలు కలుగుతాయి. మూత్ర విసర్జన చేయకపోవడం వలన పెల్విక్ ఫ్లోర్ దెబ్బతింటుంది. మూత్రాశయం నిండే దాకా కూడా ఆగవద్దు. మూత్రాన్ని ఆపుకోవడం వలన మూత్రాశయ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది.
మూత్ర విసర్జన తరచూ చేస్తూ ఉండడం వలన ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. నీరు ఎక్కువ తాగుతూ ఉంటే, ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. ఆరోగ్యవంతమైన శరీరానికి రోజుకి ఒకటిన్నర నుండి రెండున్నర లీటర్ల వరకు నీళ్లు కావాలి. ఎక్కువ నీళ్లు తాగితే, పదేపదే విసర్జన చేయాల్సి వస్తుంది. వ్యాయామం చేసే వాళ్ళు ఎక్కువ నీళ్లు తాగాలి. అలానే వేసవికాలంలో కూడా ఎక్కువ నీళ్లు తీసుకుంటూ ఉండాలి. సాధారణంగా మనుషుల బ్లాడర్ 400 మిల్లీమీటర్ల నుండి 600 మిల్లీమీటర్ల వరకు మూత్రాన్ని ఉంచుకుంటుంది. ఆ పరిమితి దాటితే, బ్లాడర్ మీద ఒత్తిడి బాగా పెరిగిపోతుంటుంది.
అయితే ఈ పరిమితి దాటిన తర్వాత మూత్రాన్ని ఆపుకోవడం వలన ఒత్తిడి కలిగి, బ్లాడర్ పరిమాణం పెరుగుతుంది. ఎప్పుడో ఒకసారి మూత్రాన్ని ఆపుకుంటే, ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ తరచూ ఇలా చేస్తున్నప్పుడు మాత్రం సమస్యలు కలుగుతాయి. అనేకసార్లు మూత్రం ఆపుకుంటే, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకుంటే తీవ్రమైన నొప్పి కూడా కలగవచ్చు. కాబట్టి అసలు ఈ పొరపాట్లు చేయకండి.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…