ఆరోగ్యం

చిలగడదుంపలతో జీర్ణక్రియ మెరుగు.. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కీలక సూచనలు!

జీర్ణశక్తిని పెంచి, పొట్టను ఆరోగ్యంగా ఉంచే చిలగడదుంపలు. Photo Credit: Japan Centre.

చిల‌గ‌డ‌దుంప‌ల‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం స‌మ‌యాల్లో వీటిని ఉడ‌క‌బెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువ‌గా తింటారు. అయితే వీటిని చాలా మంది స్నాక్స్ లాగా భావిస్తారు. కానీ ఇవి మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. చిల‌గ‌డ‌దుంప‌ల‌ను ప్ర‌స్తుతం చాలా మంది త‌క్కువ అంచ‌నా వేస్తున్నారు. వీటిని అధిక శాతం వ‌ర‌కు ప్ర‌జ‌లు తిన‌డం లేదు. కానీ వీటిని సూప‌ర్ ఫుడ్ అని డాక్ట‌ర్ శుభం వ‌త్స్య తెలిపారు. ఢిల్లీలోని వ‌సంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న ఫోర్టిస్ హాస్పిట‌ల్‌లో ఆయ‌న గ్యాస్ట్రో ఎంట‌రాలిజ‌స్టు, హెప‌టాల‌జిస్టుగా సేవ‌ల‌ను అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో చిల‌గ‌డ‌దుంప‌లు అందించే ప్ర‌యోజ‌నాలను వివ‌రించారు. వీటిని నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ద‌ని, మ‌న ఆహారంలో భాగం చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యానికి..

డాక్ట‌ర్ శుభం వ‌త్స్య తెలిపిన ప్ర‌కారం, చిల‌గ‌డ‌దుంప‌ల‌ను చాలా మంది త‌క్కువ‌గా భావిస్తూ త‌క్కువ అంచ‌నా వేస్తున్నారు. కానీ ఇవి చ‌లికాలం సీజ‌న్‌లో ల‌భించే అత్యుత్తమ ఆహారం అని ఆయ‌న తెలిపారు. చిల‌గ‌డ దుంప‌ల్లో సంక్లిష్ట‌మైన పిండి ప‌దార్థాలు ఉంటాయి. ఫైబ‌ర్ కూడా అధికంగానే ఉంటుంది. అందువ‌ల్ల ఈ దుంప‌ల‌ను తింటే జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంద‌ని ఆయ‌న తెలిపారు. చిల‌గ‌డ‌దుంప‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరం షార్ట్‌-చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు అనే స‌మ్మేళ‌నాల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఇవి జీర్ణాశయ పొర‌ను ర‌క్షించ‌డంలో ముఖ్య పాత్ర పోషిస్తాయ‌ని ఆయ‌న తెలిపారు. అలాగే సంక్లిష్ట‌మైన పిండి ప‌దార్థాలు, ఫైబ‌ర్ కార‌ణంగా చిల‌గ‌డ‌దుంప‌ల‌ను తిన్న అనంత‌రం పొట్ట నిండుగా ఉన్న భావ‌న క‌లుగుతుంది. ఎక్కువ స‌మ‌యం పాటు ఉన్నా కూడా పొట్ట నిండుగానే ఉన్న‌ట్లు అనిపిస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరానికి నిరంత‌రం శ‌క్తి ల‌భించి ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటార‌ని ఆయ‌న తెలిపారు. ఇక జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రిచేందుకు, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు, గుండెను ర‌క్షించేందుకు కూడా చిల‌గ‌డ‌దుంప‌లు స‌హాయం చేస్తాయ‌ని చెప్పారు.

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి..

చిల‌గ‌డ‌దుంప‌ల్లో రెసిస్టెంట్ స్టార్చ్ అని పిల‌వ‌బ‌డే ప్ర‌త్యేక‌మైన పిండి ప‌దార్థాలు ఉంటాయి. ఇవి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నెమ్మ‌దిగా పెరిగేలా చేస్తాయి. దీని వ‌ల్ల భోజ‌నం అనంత‌రం షుగ‌ర్ లెవల్స్ 20 నుంచి 30 శాతం మేర త‌గ్గుతాయి. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీని వ‌ల్ల షుగర్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు. ఇక ఈ దుంప‌ల్లో బీటా కెరోటీన్ అధికంగా ఉంటుంది. ఇది మ‌న శ‌రీరంలో విట‌మిన్ ఎ గా మార్పు చెందుతుంది. విట‌మిన్ ఎ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతోపాటు రేచీక‌టిని త‌గ్గించ‌డంలో స‌హాయం చేస్తుంది. దీంతో చిన్నారుల్లో కంటి చూపు మెరుగు ప‌డుతుంది. కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయ‌ని డాక్ట‌ర్ శుభం వ‌త్స్య తెలిపారు. ఈ దుంప‌ల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చ‌ర్మ క‌ణాల‌కు మ‌ర‌మ్మ‌త్తుల‌ను నిర్వ‌హిస్తాయి. దీంతో చ‌ర్మ ఆరోగ్యం సైతం మెరుగు ప‌డుతుంద‌ని అన్నారు.

మాంగ‌నీస్ కోసం..

చిల‌గ‌డ‌దుంప‌ల్లో మాంగ‌నీస్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముక‌ల ఆరోగ్యానికి దోహ‌దం చేస్తాయి. ముఖ్యంగా పోస్ట్ మెనోపాజ్ ద‌శ‌లో ఉన్న మ‌హిళ‌ల‌కు కావ‌ల్సిన పోష‌కాల‌ను ఈ దుంప‌లు అందిస్తాయి. న్యూట్రిష‌న్ సోర్స్ తెలిపిన ప్ర‌కారం, మ‌న శ‌రీరం మాంగ‌నీస్‌ను సొంతంగా త‌యారు చేసుకోలేదు. క‌నుక స్వ‌ల్ప మొత్తాల్లో ఇది మ‌న శ‌రీరానికి ల‌భించేలా చూసుకోవాలి. దీని వ‌ల్ల శ‌రీరంలో అనేక జీవ‌క్రియ‌లు సైతం స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌బ‌డ‌తాయి.

చిల‌గ‌డ‌దుంప‌ల‌ను 100 గ్రాముల మోతాదులో తింటే సుమారుగా 4 గ్రాముల ఫైబ‌ర్ ల‌భిస్తుంది. దీని వ‌ల్ల చాలా సేపు ఉన్నా పొట్ట నిండుగా ఉన్న భావ‌న క‌లుగుతుంది. ఇత‌ర ఆహార ప‌దార్థాల‌ను తినాల‌నే యావ త‌గ్గుతుంది. ముఖ్యంగా తీపి ప‌దార్థాలు, నూనె ఆహారాలు, ఇత‌ర జంక్ ఫుడ్‌ను తిన‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. దీంతో శ‌రీరంలో అద‌న‌పు క్యాల‌రీలు, కొవ్వు చేర‌కుండా నిరోధించ‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గడం తేలిక‌వుతుంది. ఇలా చిల‌గ‌డదుంప‌లు మ‌న‌కు ఎన్నో ర‌కాలుగా మేలు చేస్తాయ‌ని, వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకోవాల‌ని డాక్ట‌ర్ శుభం వ‌త్స్య తెలిపారు.

గ‌మ‌నిక‌: ఈ క‌థ‌నం కేవ‌లం స‌మాచారం, వైద్య విజ్ఞానంపై అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే. చికిత్స‌కు ప్ర‌త్యామ్నాయం కాదు. ఎవ‌రికైనా స‌రే ఏదైనా స‌మస్య ఉన్నా లేదా స‌ల‌హా కోస‌మైనా వైద్యుల‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని…

Tuesday, 31 March 2026, 8:28 PM

థియేటర్లలో మిస్ అయ్యారా? ఓటీటీలోకి వచ్చేసిన సుహాస్ ‘హే భగవాన్’.. ఎక్కడ చూడాలంటే?

థియేట‌ర్ల‌లో మిస్ అయిన సినిమాలు అన్నీ ఓటీటీల్లో రిలీజ్ అవుతుండ‌డంతో ప్రేక్ష‌కులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు.…

Tuesday, 31 March 2026, 6:13 PM

విమర్శించే వారిని పట్టించుకోవడం మానేశా.. ‘రాకాస’ ఈవెంట్‌లో నిహారిక బోల్డ్ కామెంట్స్!

త‌నను విమ‌ర్శించే వారిని ప‌ట్టించుకోవ‌డం ఎప్పుడో మానేశాన‌ని న‌టి, నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. త‌న సొంత బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న…

Tuesday, 31 March 2026, 3:05 PM

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM