Hand Wash Vs Soap : మనలో అధిక శాతం మంది భోజనానికి ముందు చేతులను సబ్బుతో లేదా హ్యాండ్ వాష్‌తో శుభ్రం చేసుకుంటారు. రోగాలు రాకుండా ఉండేందుకు గాను ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు తమ చేతులను సబ్బుతో లేదా హ్యాండ్ వాష్ తో శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వం కూడ తమ ప్రకటనల్లో చెబుతూ వస్తోంది. అయితే సబ్బు కన్నా హ్యాండ్ వాష్‌తో శుభ్రం చేసుకుంటేనే 100 శాతం క్రిములు చనిపోతాయట. అవును, మీరు విన్నది నిజమే.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారి అధ్యయనం ప్రకారం.. ఘన రూపంలో ఉండే సబ్బు కన్నా ద్రవ రూపంలో ఉండే హ్యాండ్ వాష్ వల్లే చేతులు 100 శాతం శుభ్రంగా మారుతాయని పరిశోధకులు చెబుతున్నారు. కనుక ప్రతి ఒక్కరు సబ్బు కన్నా హ్యాండ్ వాష్ తోనే చేతులను శుభ్రం చేసుకునేందుకు ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే ప్రయాణాల్లో ఉన్నప్పుడు, బయట తిరిగినప్పుడు హ్యాండ్ వాష్ లు అందుబాటులో ఉండకపోతే హ్యాండ్ శానిటైజర్‌లు వాడాలి. ఇవి కూడా ద్రవ రూపంలో ఉంటాయి. వీటిని రెండు, మూడు చుక్కలను చేతుల్లో వేసుకుని చేతులను కడుక్కున్నట్లు శుభ్రం చేసుకోవాలి. వీటికి నీరు కూడా అవసరం లేదు. హ్యాండ్ శానిటైజర్ల వల్ల కూడా చేతులను శుభ్రంగా ఉంచుకోవచ్చు. అయితే సబ్బు వాడకూడదా.. అంటే.. వాడవచ్చు.. కానీ 100 శాతం క్రిములు చనిపోతాయన్న గ్యారంటీ లేదు. కానీ క్రిములు కొంత వరకు అయితే నిర్మూలింపబడతాయి. ఏది ఏమైనా ప్రతి ఒక్కరు తినేముందు తమ తమ చేతులను మాత్రం కచ్చితంగా శుభ్రం చేసుకోవాల్సిందే. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి.
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…