Fasting : ఇష్టం దైవం పేరిట వారంలో నిర్దిష్టమైన రోజునో, శివరాత్రి వంటి పర్వదినాల్లోనో, ఇతర వ్రతాలు, పూజలు చేసినప్పుడో హిందువుల్లో అధిక శాతం మంది దేవుడికి ఉపవాసం ఉంటారు. ఇది చాలా సహజం. ఆ మాటకొస్తే ముస్లిం సోదరులు కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తారు. అయితే నిజంగా ఇలా ఉపవాసాలు ఉండడం మంచిదేనా..? అంటే, మంచిదే.. అని సైన్స్ చెబుతోంది. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉపవాస అనేది సంస్కృత పదం. ఉప అంటే దగ్గర అని, వాస అంటే ఉండడం అని అర్థం. వెరసి ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. ఒకప్పుడు ప్రజలు ఆహారాన్ని సంపాదించడం, దాన్ని వండుకోవడం, తినడం, జీర్ణం చేసుకోవడం వంటి అంశాల పట్ల ఎక్కువగా దృష్టి సారించేవారు. ఈ నేపథ్యంలోనే వారు శారీరకంగా అలసిపోవడంతోపాటు మానసిక ఏకాగ్రత ఉండేది కాదు. దీన్ని అధిగమించేందుకే వారు తక్కువ మొత్తంలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం లేదా అసలు ఆహారానికే దూరంగా ఉండడమో చేసే వారు. దీంతో శరీరం తేలిగ్గా అనిపించి మనసు కూడా ప్రశాంతమయ్యేది. దేవుడికి పూజలు, ప్రార్థనలు చేసేందుకు ఇది వారికి ఎంతగానో ఉపయోగపడేది.
ఆహారం తినకుండా అప్పుడప్పుడూ ఉపవాసం చేస్తే జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. దీంతోపాటు శరీరంలోని ఇతర అవయవాలు కూడా మెరుగ్గా పనిచేసేందుకు వీలవుతుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.
ఉపవాసంపై భగవద్గీతలో కూడా పలు అంశాలు పేర్కొనబడ్డాయి. ఉపవాసం అనేది ఒక వ్యక్తి పూర్తి ఇష్టంతోనే ఉండాలని, ఎవరూ ఈ విషయంలో బలవంతం చేయవద్దని గీత సారాంశం. అంతేకాదు శరీరం మరీ నీరసించి అనారోగ్యం కలిగేంతలా కూడా ఉపవాసం చేయకూడదు. ఉపవాసంలో ఉన్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకోవాలి. దీంతో అన్ని విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…