ఆరోగ్యం

Eucalyptus Oil : ఈ ఆయిల్‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..? చెబితే న‌మ్మ‌లేరు..!

Eucalyptus Oil : మీకు యూక‌లిప్ట‌స్ ఆయిల్ తెలుసా..? అదేనండీ.. మ‌న ద‌గ్గ‌ర చాలా మంది దాన్ని నీల‌గిరి తైలం అంటారు. అవును అదే. ఈ ఆయిల్ వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ఎన్నో క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లను త‌గ్గించేందుకు ఈ తైలాన్ని ఆయుర్వేదంలోనూ ఉప‌యోగిస్తారు. మ‌రి ఈ ఆయిల్ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా.

నీల‌గిరి తైలాన్ని వాస‌న చూస్తే చాలు మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. నిత్యం ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యేవారు కొద్దిగా యూక‌లిప్ట‌స్ ఆయిల్ వాస‌న చూడండి. అంతే.. బాడీ, మైండ్ రెండూ రిలాక్స్ అవుతాయి. ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. నీల‌గిరి తైలం నుంచి వ‌చ్చే వాస‌న అరోమాథెర‌పీలా ప‌నిచేసి మ‌న‌కు క‌లిగే ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను తగ్గిస్తుంది. వెంట్రుక‌లు రాలిపోతున్నాయ‌ని బాధ‌ప‌డేవారు నీలగిరి తైలాన్ని రోజూ కొంత మోతాదులో తీసుకుని జుట్టుకు మ‌ర్ద‌నా చేయాలి. దీని వ‌ల్ల వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది. అంతేకాదు జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. అలాగే చుండ్రు త‌గ్గుతుంది. వెంట్రుక‌లు ప్ర‌కాశ‌వంతంగా మారుతాయి.

Eucalyptus Oil

నిత్యం మీరు వాడే పేస్టులో యూక‌లిప్ట‌స్ ఆయిల్‌ను క‌లిపి దంతాల‌ను తోముకుంటే దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. దంతాల‌పై ఉండే గార‌, పాచి పోతాయి. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. దంతాలు త‌ళ‌త‌ళా మెరుస్తాయి. జుట్టులో పేలు బాగా ఉన్న‌వారు నీల‌గిరి తైలాన్ని త‌ర‌చూ మర్ద‌నా చేసి త‌ల‌స్నానం చేస్తే ఫ‌లితం క‌నిపిస్తుంది. ముక్కు దిబ్బడ‌, జ‌లుబు ఉన్న‌వారు నీల‌గిరి తైలం వాస‌న చూస్తే చాలు ఆ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. విరేచ‌నాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారి పొట్ట‌పై కొద్దిగా యూక‌లిప్ట‌స్ ఆయిల్‌ను రాయాలి. పొట్ట చుట్టూ సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. దీంతో స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

కీళ్లు, కండ‌రాల నొప్పులు ఉన్న‌వారు నొప్పి ఉన్న ప్ర‌దేశంలో యూక‌లిప్ట‌స్ ఆయిల్‌ను రాసి బాగా మ‌ర్ద‌నా చేస్తే నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. నీల‌గిరి తైలంలో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల కాలిన గాయాలు, దెబ్బ‌లు, పుండ్లకు ఈ ఆయిల్ ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. సంబంధిత ప్ర‌దేశంపై ఈ ఆయిల్‌ను త‌ర‌చూ రాస్తుంటే గాయాలు మానిపోతాయి. దెబ్బలపై రాస్తే నొప్పి, మంట త‌గ్గుతాయి. పుండ్లు కూడా త‌గ్గుతాయి. ఇలా మ‌న‌కు యూక‌లిప్ట‌స్ ఆయిల్ ఎంత‌గానో మేలు చేస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM