ఆరోగ్యం

Bean Flour For Hair : శ‌న‌గ‌పిండితో ఇలా చేస్తే చాలు.. చుండ్రు ఉండ‌దు.. జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది..!

Bean Flour For Hair : శనగపిండితో అనేక లాభాలని పొందొచ్చు. శనగపిండి అందాన్ని పెంపొందిస్తుంది. శనగపిండి చుండ్రు మొదలైన సమస్యల్ని కూడా తొలగించగలదు. చాలామందికి ఈ విషయం తెలియ‌దు. శనగపిండి కేవలం ఆరోగ్యానికి, అందానికి మాత్రమే అని అనుకుంటారు. కానీ శనగపిండి వలన జుట్టు రాలిపోవడం, చుండ్రు వంటి బాధల నుండి కూడా బయటపడొచ్చు. చాలామంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి, అనేక రకాల ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు.

వాటి కంటే మనం ఇంటి చిట్కాలతో సమస్యల‌ను పరిష్కరించుకోవచ్చు. పైగా, తక్కువ ఖర్చు అవుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలగవు. ఇంట్లో ఉండే ఈ పదార్థాలతోనే సులభంగా మనం జుట్టు రాలిపోవడం, చుండ్రు వంటి బాధల నుండి బయటపడొచ్చు. అది కూడా ఎక్కువ పదార్థాలు కాదు. కేవలం రెండే పదార్థాలు.

Bean Flour For Hair

పెరుగు, శనగపిండి రెండు కూడా మన ఇంట్లో ఉండేవే. ఈ రెండింటితో మనం కుదుళ్ళని బలంగా మార్చుకోవచ్చు. ఒక కప్పు పెరుగు తీసుకుని అందులో మూడు స్పూన్ల దాకా శనగపిండి వేసుకోండి. దీనంతటిని బాగా మిక్స్ చేసి, జుట్టు పై నుండి కింద వరకు బాగా పట్టించండి. ఐదు నిమిషాలు దాకా మసాజ్ చేస్తూ ఉండండి.

అరగంట పాటు వదిలేయండి. ఆ తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయండి. ఇలా చేస్తే చుండ్రు, జుట్టు రాలిపోవడం వంటి బాధలు ఏమీ వుండవు. వారానికి రెండుసార్లు రిపీట్ చేస్తూ ఉండండి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. చనిపోయిన చర్మ కణాలని ఇది తొలగిస్తుంది. మాడుని శుభ్రపరుస్తుంది. పెరుగు లో మంచి ప్రోటీన్ కుదుళ్ళకి బలాన్ని ఇస్తుంది. శనగ పిండి కూడా అందమైన కురులని ఇస్తుంది.  ఇలా సులభంగా ఈ రెండింటితో మనం అందమైన కురులని పొందవచ్చు. జుట్టు కూడా రాలదు. చుండ్రు కూడా త‌గ్గుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM