Brinjal : వంకాయ.. ఆంగ్లంలో దీన్నే ఎగ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇది మనకు రక రకాల సైజ్‌లలో రక రకాల కలర్లలో లభిస్తుంది. కొన్ని వంకాయలు గుండ్రంగా పొట్టిగా ఉంటే.. కొన్ని పొడుగ్గా ఉంటాయి. ఇంకా కొన్ని వంకాయలు తెల్లగా ఉంటే కొన్ని పర్పుల్ కలర్‌లో ఉంటాయి. అయితే ఇతర అన్ని కూరగాయల్లాగే వంకాయల ద్వారా కూడా మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మరి వంకాయల ద్వారా మనకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
1. వంకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. అలాగే శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వంకాయల్లో ఉండే ఆంథోసయనిన్స్ గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అలాగే వంకాయల్లో ఉండే నాసునిన్ అనే సమ్మేళనం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
2. వంకాయల్లో పాస్ఫరస్, ఐరన్, కాల్షియం, విటమిన్ బి1, బి2, బి3, బి6లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల జీర్ణవ్యవస్థలో ఏవైనా సమస్యలు ఉంటే పోతాయి. అలాగే మూత్రాశయ సమస్యలు కూడా తగ్గుతాయి.
3. వంకాయ తొక్కలో ఫైబర్, పొటాషియం, మెగ్నిషియంలు పుష్కలంగా ఉంటాయి. దీంతో మన శరీరానికి పోషణ లభిస్తుంది. జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.
4. వంకాయలను తరచూ తింటే రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లు, ఎల్‌డీఎల్ స్థాయిలు తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి.
5. వంకాయల్లో ఉండే పాలీఫినాల్స్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. అందువల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
6. వంకాయలను రెగ్యులర్‌గా తింటే హైబీపీ తగ్గుతుంది. అలాగే అల్సర్లు ఉన్నా పోతాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా బయట చాలా అరుదైన సందర్భాల్లో…
ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు…
సినిమాల్లో సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటించడం సహజమే. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని భాషల్లోనూ ఎప్పటి నుంచో…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ ఘన విజయం సాధించి ముందుకు సాగుతున్న…
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…