food

Boti Fry : బోటి ఫ్రై ని ఒక్క‌సారి ఇలా చేస్తే చాలు.. నోట్లో నీళ్లూర‌డం ఖాయం..!

Boti Fry : మాంసాహార ప్రియులు అంద‌రూ అనేక ర‌కాల నాన్ వెజ్ వంట‌కాల‌ను ఇష్ట‌ప‌డుతుంటారు. హోట‌ల్స్‌కు వెళితే భిన్న ర‌కాల వంట‌లు అందుబాటులో ఉంటాయి. క‌నుక అప్పుడ‌ప్పుడు హోట‌ల్స్‌కు వెళ్తూ త‌మ జిహ్వా చాప‌ల్యాన్ని తీర్చుకుంటుంటారు. ఇక మ‌నం ఇంట్లోనూ ప‌లు వంట‌కాల‌ను రెగ్యుల‌ర్‌గా వండుతుంటాం. వాటిల్లో బోటి కూడా ఒక‌టి. దీంతో చాలా మంది కూర చేస్తారు. కానీ బోటి ఫ్రై వాస్త‌వానికి అద్భుతంగా ఉంటుంది. అన్నీ స‌రైన పాళ్ల‌లో వేయాలే కానీ బోటి ఫ్రై రుచి అదిరిపోతుంది. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ మళ్లీ ఇలాగే చేసుకుంటారు. ఈ క్ర‌మంలోనే బోటి ఫ్రైని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బోటి ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోటి – అర కిలో, పెరుగు – 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు, నిమ్మ‌ర‌సం – 1 టేబుల్ స్పూన్‌, కారం – 1 టీస్పూన్‌, ప‌సుపు – అర టీస్పూన్‌, గ‌రం మ‌సాలా – 1 టీస్పూన్‌, జీల‌క‌ర్ర పొడి – 1 టీస్పూన్‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా, నూనె – ఫ్రై చేసుకోవడానికి కావ‌ల్సినంత‌, కొత్తిమీర (గార్నిష్ కోసం) – కొద్దిగా.

Boti Fry

బోటి ఫ్రై త‌యారీ విధానం..

ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, నిమ్మ‌ర‌సం, కారం, ప‌సుపు, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి, ఉప్పు వేసి అన్నీ క‌లిసేలా బాగా క‌ల‌పాలి. శుభ్రం చేసి త‌రిగిన బోటిని అందులో వేసి మ‌ళ్లీ క‌ల‌పాలి. బోటి ముక్క‌ల‌కు మిశ్ర‌మం బాగా ప‌ట్టేలా క‌ల‌పాలి. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి ఫ్రిజ్‌లో 2 గంట‌ల పాటు ఉంచి మ్యారినేట్ చేయాలి. లేదా రాత్రి ఇలా క‌లిపి పెట్టి ఉద‌యం వ‌ర‌కు అలాగే ఉంచ‌వ‌చ్చు. దీంతో ముక్క‌లు మ‌రింత టేస్టీగా ఉంటాయి. ఒక పాన్ లేదా క‌డాయి తీసుకుని అందులో నూనె పోసి మీడియం మంట‌పై వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బోటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేయాలి.

బోటి ముక్క‌లు గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్‌లో క్రిస్పీగా మారేంత వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వాటిని బ‌య‌ట‌కు తీసి ప్లేట్‌లో వేసుకోవాలి. ఇలా బోటి మొత్తాన్ని ఫ్రై చేయాలి. అనంత‌రం దానిపై త‌రిగిన కొత్తిమీర ఆకుల‌ను వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే.. ఎంతో రుచిక‌ర‌మైన బోటి ఫ్రై రెడీ అవుతుంది. దీన్ని స్నాక్స్‌గా తిన‌వ‌చ్చు. లేదా నేరుగా అన్నంలో క‌లిపి తిన‌వ‌చ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM