ఈత నేర్చుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ కొందరే ధైర్యంగా ఈత నేర్చుకుంటారు. చాలా మంది ఈత అంటే భయపడతారు. అలాంటి వారు స్విమ్మింగ్ పూల్స్‌లో ముందుగా ఈత కొట్టడం ప్రాక్టీస్ చేస్తారు. తరువాత నెమ్మదిగా ఈత నేర్చుకుంటారు. అయితే ఈత వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకుంటే ఈత కొట్టడాన్ని ఎవరైనా సులభంగా నేర్చుకోవచ్చు. మరి ఆ సైన్స్ ఏమిటంటే…
నీటి కన్నా మనిషి శరీరం సాంద్రత కొంచెం తక్కువ. అందువల్ల నీళ్లను మింగకుండా ఉంటే నీటిలో మన శరీరం తేలుతుంది. ఇది సైన్స్ చెబుతున్నమాట. అందుకనే చాలా మంది తమ నోరు, ముక్కును నీటి ఉపరితలం కన్నా పైన ఉంచి ఈత కొడుతారు. ఇదే అసలు ట్రిక్. నీటి స్థాయి కన్నా పైభాగంలో నోరు, ముక్కు ఉండాలి. దీంతో శరీరం నీటిలో తేలుతుంది. కానీ నీటిని మింగరాదు. అలాగే భయపడరాదు. భయం వల్ల ఈత కొట్టే సమయంలో చాలా మంది నీళ్లు తాగుతారు. దీంతో నీటిలో మునిగిపోతారు. కానీ భయపడకుండా నీటిలో శరీరాన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేయాలి. అందుకు ముందుగా ముక్కు, నోరును ఎప్పుడూ పైకి ఉంచాలి.
చిత్రంలో ఇచ్చిన విధంగా నీటిలో 30 నుంచి 60 డిగ్రీల మధ్యలో ఒక కోణం ఏర్పడేలా ఉండి ఈత కొట్టాలి. ఆ సమయంలోనూ నోరు, ముక్కులను నీటికి పై భాగంలో ఉండేలా చూసుకోవాలి. తరువాత వెనుక వైపు కాళ్లను ఆడించాలి. ముందు వైపు చేతుల్తో నీళ్లను వెనక్కి నెట్టాలి. ఇది శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. దీంతో నీటిలో తేలుతారు. అయితే ఇలా చేయాలంటే శరీరం మొత్తం కదలాల్సి ఉంటుంది. కనుక మొదటిసారి ఈత కొట్టే వారికి బాగా శ్రమ అనిపించినట్లు అవుతుంది. కానీ నిరంతరం సాధన చేస్తే తేలికవుతుంది. జంతువులు కూడా నోరు, ముక్కులను నీటికి పై భాగంలో ఉండేలా ఉంచి ఈత కొడతాయి. గమనించవచ్చు. ఈ సూత్రాన్ని గుర్తుంచుకుంటూ శరీరాన్ని నీటిలో బ్యాలెన్స్ చేయగలిగితే చాలు. ఈత కొట్టడాన్ని వేగంగా నేర్చుకుంటారు. అదేమీ బ్రహ్మ విద్య కాదు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…