Secrets : ఈ రహస్యాలని ఎట్టిపరిస్థితుల్లోనూ అస్సలు ఎవరికీ చెప్పకూడదు..!

July 12, 2023 10:23 AM

Secrets : ప్రతి ఒక్కరు కచ్చితంగా వీటిని ఆచరించి తీరాలి. వీటిని మీరు ఆచరించారంటే కచ్చితంగా ఇప్పుడు ఉన్న దాని కంటే మరింత బాగుంటారు. రోజూ మనం నిద్రలేచిన తర్వాత మొదట కుడి పాదాన్ని నేల మీద పెట్టాలి. మొదట కుడి పాదాన్ని నేలకి తగిలించి నిద్ర లేవడం వలన ఎటువంటి అడ్డంకులు కూడా ఉండవు. అలానే ప్రతి సోమవారం శివుడు ముందు పిండితో చేసిన ఐదు ముఖాల దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే అనుకున్న పనులు పూర్తవుతాయి. అలానే మనం ఇంటి నుండి ఏదైనా ముఖ్యమైన పని కోసం బయలుదేరేటప్పుడు, ఒకసారి దైవాన్ని తలచుకుని వెళితే, వెళ్ళిన పని పూర్తవుతుంది.

ప్రతిరోజు ఉదయం ఇంట్లో పూజలు చేసి, హారతి ఇచ్చే టైంలో మూడు లవంగాలను ఆ దీపంలో వేసి హారతిని ఇస్తే పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా, అనుకున్న పని పూర్తి అవుతుంది. విజయం మీ సొంతమవుతుంది. ఏదైనా ముఖ్యమైన పనికి కానీ శుభకార్యానికి కానీ ఇంటి నుండి వెళ్లేటప్పుడు, ఆ పనిలో ఆటంకాలు లేకుండా ఉండాలంటే, బయలుదేరే ముందు మొదట కుడి పాదాన్ని బయటపెట్టి ఆ తర్వాత మీరు వెళ్ళండి. ఇలా చేయడం వలన ఆటంకాలు ఏమీ రావు.

do no tell these Secrets to others
Secrets

అలానే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత రాగి పాత్రలో నీళ్ళు పోసి, ఆ నీటిని తులసి మొక్కలో పొయ్యండి. నీళ్లు పోసిన తర్వాత ఏడు సార్లు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అప్పుడు అనుకున్నవి నెరవేరుతాయి. అదే విధంగా మీరు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ చెప్పకూడదు.

మీ కష్టాన్ని ఎప్పుడూ కూడా ఇతరులకి చెప్పకూడదు. నేను ఇంత కష్టపడ్డాను, అది చేశాను అని తెలియనివ్వద్దు. మీ బిజినెస్ లో టెక్నిక్స్ గురించి కూడా ఎవరికీ చెప్పకండి. అలానే మీ బిజినెస్ లో ప్రణాళిక గురించి కూడా ఎవరికీ చెప్పకూడదు. ఎక్కడైనా సరే మీకు అవమానం జరిగితే దాని గురించి ఇతరులకి చెప్పుకోకూడదు. మీ ఆస్తి వివరాలను కూడా ఎవరితోనూ చెప్పకూడదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now