గురువారం, జూన్ 11, 2026
వినోదం

VJ Sunny : బిగ్‌బాస్‌ విన్న‌ర్ సన్నీ.. మొత్తం గెలిచింది రూ.1 కోటి పైనే..!

VJ Sunny : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంలోకి వ‌చ్చిన‌ప్పుడు అత‌డిని అంద‌రూ నార్మ‌ల్ కంటెస్టెంట్‌గానే భావించారు. అంద‌రూ అత‌నిపై దాడి చేస్తుండ‌డంతో స‌న్నీ విజేత కాడ‌నే అనుకున్నారు. కానీ అందరి ఆలోచ‌న‌లను త‌ల‌కిందులు చేస్తూ బిగ్…

VJ Sunny : బిగ్‌బాస్‌ విన్న‌ర్ సన్నీ.. మొత్తం గెలిచింది రూ.1 కోటి పైనే..!

VJ Sunny : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంలోకి వ‌చ్చిన‌ప్పుడు అత‌డిని అంద‌రూ నార్మ‌ల్ కంటెస్టెంట్‌గానే భావించారు. అంద‌రూ అత‌నిపై దాడి చేస్తుండ‌డంతో స‌న్నీ విజేత కాడ‌నే అనుకున్నారు. కానీ అందరి ఆలోచ‌న‌లను త‌ల‌కిందులు చేస్తూ బిగ్ బాస్ సీజ‌న్ ట్రోఫీని ఎగ‌రేసుకుపోయాడు స‌న్నీ. తాను పడ్డ వంద రోజుల కష్టమంతా ట్రోఫీ అందుకోగానే మటుమాయమైపోయింది. ఎన్నో ఏళ్లుగా సన్నీ పడుతున్న కష్టానికి నేడు ప్రతిఫలం దక్కిందని అతడి తల్లి భావోద్వేగానికి లోనైంది.

VJ Sunny got more than rs 1 crore for winning bigg boss season 5 telugu title

ఇన్ని రోజుల పాటు బిగ్‌బాస్‌ షోలో ఉన్నందుకు రెమ్యునరేషన్‌తో పాటు టైటిల్‌ను గెలుచుకున్నందుకుగాను రూ. 50 లక్షల ప్రైజ్‌ మనీకి సంబంధించి చెక్‌ను నాగార్జున చేతుల మీదుగా అందుకున్నాడు. ఇక అంతేకాకుండా సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్‌ తరఫున షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల ప్లాట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. వీటితో పాటు టీవీఎస్‌ కంపెనీకి చెందిన బైక్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.

బిగ్ బాస్ షో ద్వారా స‌న్నీ ఎంత లేద‌న్నా కోటి రూపాయ‌ల‌కు పైగానే అందుకున్నాడ‌ని స‌మాచారం. అయితే త‌న త‌ల్లి కోరిక తీర్చాల‌ని ప‌దే ప‌దే చెప్పుకొచ్చిన స‌న్నీ ఎట్ట‌కేల‌కు ట్రోఫీ అందుకొని త‌ల్లితోపాటు ఎంద‌రో మ‌న‌సులను గెలుచుకున్నాడు. తన ట్యాలెంట్‌తో ఇంకా ఎంతో సాధిస్తానని, తన తల్లికి బిగ్‌బాస్‌ ట్రోఫీలాంటి ఇంకా ఎన్నో బరువులు మోయాల్సి ఉంటుందని ఎంతో ధీమాగా చెప్పిన సన్నీ మరి ఏ మేర సక్సెస్‌ అవుతాడో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి