గురువారం, జూన్ 11, 2026
వినోదం

SS Rajamouli : బాలకృష్ణతో సినిమా ఎందుకు చేయలేదో చెప్పేసిన రాజమౌళి..!

SS Rajamouli : టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో మాస్‌ హీరో ఎవరని అడిగితే.. అందుకు నందమూరి బాలకృష్ణ.. అని ఎవరైనా సరే ఠక్కున సమాధానం చెబుతారు. బాలయ్య ఇప్పుడు కాదు.. ఎప్పటి నుంచి మాస్‌ హీరోగా మంచి పేరు…

SS Rajamouli : బాలకృష్ణతో సినిమా ఎందుకు చేయలేదో చెప్పేసిన రాజమౌళి..!

SS Rajamouli : టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో మాస్‌ హీరో ఎవరని అడిగితే.. అందుకు నందమూరి బాలకృష్ణ.. అని ఎవరైనా సరే ఠక్కున సమాధానం చెబుతారు. బాలయ్య ఇప్పుడు కాదు.. ఎప్పటి నుంచి మాస్‌ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఆయన తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఎంతో మంది దర్శకులతో పనిచేశారు కానీ రాజమౌళితో ఒక్క సినిమా కూడా తీయలేదు.

SS Rajamouli this is why he did not do movie with balakrishna

వాస్తవానికి రాజమౌళి కూడా పలు సందర్భాల్లో తనకు బాలయ్య అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. మరలాంటప్పుడు బాలకృష్ణతో రాజమౌళి ఎందుకు సినిమా తీయలేదనే ప్రశ్న ప్రేక్షకుల్లో తలెత్తుతూ ఉంటోంది. అయితే అందుకు స్వయంగా రాజమౌళి సమాధానం చెప్పారు.

త్వరలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షోలో రాజమౌళి, ఇతర ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ గెస్టులుగా కనిపించనున్న విషయం విదితమే. ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను కూడా ఇటీవలే లాంచ్‌ చేశారు. అయితే అందులో బాలకృష్ణ.. రాజమౌళిని పలు పంచింగ్‌ ప్రశ్నలు అడిగారు.

గతంలో ఒకసారి రాజమౌళి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బాలకృష్ణతో ఎందుకు సినిమాలు చేయలేదని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. బాలకృష్ణను తాను హ్యాండిల్‌ చేయలేనని అన్నారు. అయితే అదే విషయాన్ని బాలకృష్ణ స్వయంగా రాజమౌళిని అడిగారు. నన్ను హ్యాండిల్‌ చేయలేనని అన్నావు.. ఎందుకు అలా అనాల్సి వచ్చిందని.. బాలయ్య అడగ్గా.. అందుకు రాజమౌళి స్పందించారు.

బాలకృష్ణ అంటే అందరికీ గౌరవం ఉంటుంది. ఆయనంటే అందరికీ భయమే. అయితే నాతో సినిమా తీసే హీరోలను షూటింగ్‌ సమయంలో నా ఇష్టం వచ్చినట్లు వాడుకుంటా. హీరో కష్ట సుఖాల గురించి ఆలోచించను. ఇది అందరు హీరోలకు నచ్చకపోవచ్చు. మీరంటే గౌరవం, భయం. మీతో కూడా అలాగే ప్రవర్తిస్తే మీరేమైనా అంటారేమోనని ఆందోళన.. అందుకనే మిమ్మల్ని హ్యాండిల్‌ చేయలేనని, మీతో సినిమా తీయలేనని చెప్పా.. అదీ విషయం.. అని రాజమౌళి స్పష్టం చేశారు.

అయితే వాస్తవానికి మగధీర కథతో అప్పట్లో బాలకృష్ణ దగ్గరకు రాజమౌళి వెళ్లారట. కానీ తరువాత ఏమైందనే విషయం తెలియలేదు. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో గనక సినిమా వస్తే.. అది నభూతో నభవిష్యత్‌ అన్నట్లు ఉంటుందని.. గతంలో ఎన్నడూ చూడని బాలయ్యను చూసే అవకాశం లభిస్తుందని.. ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి ఆ విధంగా జరుగుతుందా.. లేదా.. అన్నది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి