Sara Tendulkar : ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీలకి స్పందించిన వార్తలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే.తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూతురికి సంబంధించిన వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. సచిన్ కూతురు సారా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. తనకు ట్విటర్ (ఎక్స్)లో ఎలాంటి అకౌంట్ లేదన్న సారా టెండూల్కర్.. తన పేరిట అసత్య ప్రచారం సాగుతోందని వాపోయింది. తన పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించి డీప్ ఫేక్ ఫోటోలను షేర్ చేస్తున్నారని మండిపడింది. నకిలీ ఖాతాలపై.. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.ఇటీవలి కాలంలో డీప్ ఫేక్ అంశం సీని ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.
టాలీవుడ్ నటి రష్మిక మందన్నాడీప్‌ఫేక్ వీడియోలు, ఫోటోలు సంచనలం అయ్యాయి. ఆ తర్వాత చాలామంది ఆ డీప్‌ఫేక్ వీడియోలకు బలయ్యారు. స్వయాన దేశ ప్రధాని నరేంద్రమోడీ కూడా డీప్‌ఫేక్ బారిన పడిన విషయం తెలిసిందే. అనంతరం బాలీవుడ్ నటి కాజల్ కూడా ఆ జాబితాలో ఉన్నారు. ఇప్పడు తాజాగా సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా డీప్ ఫేక్ వీడియోలకు గురయినట్లు స్వయాన తనే ప్రకటించింది. ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా గిల్‌కు విషెస్ చెబుతున్నట్లుగా సారా టెండూల్కర్ పేరిట బ్లూటిక్ మార్క్ ఉన్న ట్విటర్ అకౌంట్ నుంచి కొన్ని పోస్టులు వచ్చాయి.
ఆ సమయంలో చాలా మంది నెటిజన్స్ సారా నిజమైన అకౌంట్ అని భావించి.. ఈ అంశమై మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తన పేరిట ఉన్న నకిలీ అకౌంట్ నుంచి జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సారా టెండూల్కర్ స్పందించింది. ఎక్స్‌లో తనకు అకౌంటే లేదని ఇన్‌స్టాగ్రామ్‌లో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టిన సారా టెండూల్కర్.. తన పేరిట ఉన్న నకిలీ అకౌంట్ల మీద చర్యలు తీసుకోవాలని ఎక్స్ యాజమాన్యాన్ని కోరింది. మన బాధలు, సంతోషాలు అలాగే రోజువారీ కార్యక్రమాలను పంచుకునేందుకు సోషల్ మీడియా ఓ అద్భుతమైన వేదిక.
అయితే కొంతమంది ఈ సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. వాస్తవాలను దాచేస్తూ అభూత కల్పనలతో ఇంటర్నెట్‌ను నింపేస్తున్నారు. నా డీప్ ఫేక్ ఫోటోలు కూడా నా దృష్టికి వచ్చాయి. ఎక్స్‌లో నాపేరుతో నకిలీ ఖాతాలు తెరిచి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజానికి నాకు ఎక్స్‌లో అకౌంటే లేదు. నా పేరుతో ఉన్న నకిలీ అకౌంట్లను ఎక్స్ వీలైనంత త్వరగా గుర్తించి తొలగిస్తుందని ఆశిస్తున్నా..వాస్తవాలను పంచుకోవడానికే సోషల్ మీడియాను ఉపయోగిద్దాం” అంటూ పోస్ట్ షేర్ చేసింది సారా టెండూల్కర్.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…