వినోదం

Salaar Day 3 Collection : సలార్ ఊచ‌కోత‌.. మూడ‌వ రోజు కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ప్ర‌భాస్ మూవీ..

Salaar Day 3 Collection : భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన తాజా చిత్రం స‌లార్. క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రానికి క‌లెక్ష‌న్స్ వ‌ర్షం కురుస్తుంది.సలార్ సినిమా బాక్సాఫీస్ పునాదులను కదిలిస్తోంది. గతంలో ఉన్న లెక్కలను తిరగరాస్తోంది. సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. సినిమాలో ఎక్కడా ఒక్క వల్గర్ సీన్ కూడా లేదు. ముద్దుల్లేవు.. హగ్గుల్లేవు… అయినా సరే ప్రేక్షకులు మాత్రం దీన్ని బాగా ఆదరించారు. సినిమా మొత్తం మంచి కథ, కథనంతో ముందుకు వెళ్లడంతో ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు.. ఇటీవలి కాలంలో కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమానే రాలేదు.. ఒక్క హాయ్ నాన్న మినహా.

స‌లార్ చిత్రంలో అసభ్యకరమైన పదజాలం కూడా ఎక్క‌డ క‌నిపించ‌లేదు.. అలాంటి సినిమా రూ.వెయ్యి కోట్లు కలెక్ట్ చేసేదిగా ముందుకు దూసుకుపోతోంది. సలార్ మొదటి రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. స‌లార్ ,చిత్రం విడుదలైన రోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 97.49 కోట్ల షేర్, రూ. 167 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. వాటిలో తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 71 కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేయగా.. హిందీలో రూ. 20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 53.50 కోట్లు కేరళలో రూ. 4.75 కోట్లు గ్రాస్ వసూలు చేసిన‌ట్టు తెలుస్తుంది.ఈ సినిమా మొదటి రోజే దేశ వ్యాప్తంగా రూ.93.45 కోట్లు వసూల్‌ చేసింది. ఇదే జోరును రెండో రోజూ ప్రదర్శిస్తూ అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.57.61 కోట్ల కలెక్షన్లను సాధించింది.

Salaar Day 3 Collection

దీంతో రెండు రోజుల్లోనే సినిమా దాదాపు రూ.150 కోట్లు దాటింది. వరల్డ్​వైడ్​గా ‘సలార్’ తొలిరోజు రూ. 178.7 కోట్లు వసూల్ చేసింది. సలార్ రెండో రోజు కూడా 100 కోట్ల మార్క్ అందుకుని 2 రోజుల్లో మొత్తంగా రూ. 250 కోట్ల గ్రాస్, రూ. 170 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేయనుందని విశ్లేషకులు అంచనా వేశారు. అలాగే మూడో రోజు ఆదివారం కూడా సలార్‌కు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. సలార్‌కు హిందీ బెల్ట్‌లో రూ. 5.5 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు ట్రేడ్ సంస్థలు చెబుతుండ‌గా, ఢిల్లీ రూ. 96.89 లక్షలతో అగ్రస్థానంలో ఉంటే.. రూ. 50.87 లక్షలతో ముంబై రెండో స్థానం, రూ. 24.26 లక్షలతో బెంగళూరు మూడో స్థానంలో నిలిచింది. విడుదలైన తొలి రెండు రోజుల్లో వసూళ్ల సునామీ సృష్టించిన సలార్ మూడో రోజు కూడా అదే హవా కొనసాగించనుందని సినిమా ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM